వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ యూజర్స్ నెత్తిన భారీ పిడుగు.. కనీస డేటా టారిఫ్స్ ఏ రేంజ్‌లో పెరగనున్నాయంటే..

|
Google Oneindia TeluguNews

మొబైల్ ఇంటర్నెట్ డేటా విషయంలో ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లను భారతీయులు ఇన్నాళ్లు ఎంజాయ్ చేశారు,చేస్తున్నారు. కానీ త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడబోతోంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు రూ.3.5 చొప్పున టెలికాం కంపెనీలు చార్జి చేస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో కనీస టారిఫ్స్ భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కనీస టారిఫ్స్ కంటే ఈ ధరలు 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

నీతి ఆయోగ్ సీఈవో ఏమన్నారు..

నీతి ఆయోగ్ సీఈవో ఏమన్నారు..

అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్,ఐడియా ఒక జీబీ డేటాకు కనీసంగా రూ.35 టారిఫ్ విధించాలని ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)కు ప్రతిపాదించాయి. భారతీ ఎయిర్‌టెల్ కనీస డేటా టారిఫ్‌ను రూ.30గా, రిలయన్స్ జియో రూ.20గా ప్రతిపాదించాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ ప్రతిపాదనలను సమర్థించారు. భారీ అప్పులు,ధరల అస్థిరత్వం కారణంగా సతమతమవుతున్న టెలికాం రంగం.. వాటి నుంచే బయటపడాలంటే డేటా టారిఫ్స్,కాల్ చార్జీలు పెంచడం కంటే మరో మార్గం లేదన్నారు. ఫోన్ కాల్స్,డేటాకు సంబంధించి కనీస టారిఫ్‌లపై ట్రాయ్‌పై ఇటీవలే నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అభికాంత్ దాస్ ఇలా స్పందించారు.

ఎంత పెరగవచ్చు..

ఎంత పెరగవచ్చు..

కాల్స్,డేటా టారిఫ్స్‌పై ఇప్పటివరకు ఆయా టెలికాం కంపెనీలకే పూర్తి స్వేచ్చ ఉండేది. కానీ సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా టారిఫ్స్ విషయంలో టెలికాం కంపెనీలే 'టెలికాం రెగ్యులేటరీ' జోక్యాన్ని కోరాయి. ప్రస్తుతం రూ.599 ప్లాన్‌లో రూ.3.5కే టెలికాం కంపెనీలు ఒక జీబీ డేటాను 4జీ స్పీడ్‌తో 84 రోజుల వాలిడిటీతో అందిస్తున్నాయి. కానీ టెలికాం కంపెనీల తాజా ప్రతిపాదనలకు ట్రాయ్‌ ఆమోదిస్తే గనుక.. అదే ప్లాన్‌ రూ.3360 నుంచి రూ.5880 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక జీబీ డేటాకు రూ.20 నుంచి రూ.35వరకు చార్జి చేసే అవకాశం ఉంది.

తప్పు పడుతోన్న సీసీఐ

తప్పు పడుతోన్న సీసీఐ


టెలికాం రంగం నుంచి వచ్చిన డిమాండ్ తర్వాత కాల్ మరియు డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సమాలోచనలు జరుపుతోంది. అయితే కాంపిటీన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతుండటం గమనార్హం. ఇలాంటి చర్యలు తిరోగమనం అని.. ఇది మార్కెట్‌ పోటీపై హానికర ప్రభావం చూపుతుందని పేర్కొంది.

English summary
Currently, mobile subscribers in India get access to 4G data at a price as low as Rs 3.5 per GB. But, if the floor price (minimum rates) is fixed as demanded by telecom operators, the mobile internet prices will rise 5-10 times from the current level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X