Wife: లవ్ మ్యారేజ్, భర్త ఇంట్లో ఉన్నా భార్య వేరే వ్యక్తితో ?, స్మార్ట్ ఫోన్ పీస్ పీస్, భార్య ఏం చేసిందంటే ?
చెన్నై/ తిరునల్వేలి: ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కూతురు పుట్టిన తరువాత భార్య, భర్త కుటుంబ సభ్యులు కలిసిపోయారు. దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న భార్య నిత్యం మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోందని తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి భర్త ఇంటికి వెళ్లినా భార్య మొబైల్ ఫోన్ చెవి దగ్గర నుంచి కిందకు దించడం లేదని సమాచారం. చాలాకాలం ఓపికగా చూసిన భర్త అతని భార్య మొబైల్ ఫోన్ పీస్ పీస్ చేశాడు. దెబ్బకు గదిలోకి వెళ్లిన భార్య ఉరి వేసుకోవడం కలకలం రేపింది.

నెల్లూరు టూ తిరునల్వేలి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన మైఖేల్ మదన్ సింగ్ అలియాస్ మైఖల్ కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పనగుడి చేరుకుని భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తున్నాడు. పనగుడి ప్రాంతంలోనే నివాసం ఉంటున్న స్నేహా అనే యువతి మైఖేల్ కు పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్..... దంపతులు హ్యాపీ
ఆరు సంవత్సరాల క్రితం మైఖేల్, స్నేహా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన మైఖేల్, స్నేహా పెళ్లి చేసుకున్నారు. స్నేహా, మైఖేల్ దంపతులకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. మైఖేల్, స్నేహా దంపతులకు కూతురు పుట్టిన తరువాత భార్య, భర్త కుటుంబ సభ్యులు కలిసిపోయారు.

మొబైల్ ఫోన్ లేకుంటే ?
మైఖేల్, స్నేహా దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని భర్త మైఖేల్ తో కాపురం చేస్తున్న స్నేహా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తితో మాట్లాడటానికి బానిస అయ్యింది. స్నేహా నిత్యం మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోందని తెలిసింది.

పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య
స్నేహా మొబైల్ ఫోన్ లో ఎక్కువ మాట్లాడుతున్న విషయం ఆమె భర్త మైఖేల్ గమనించాడు. ఇదే విషయంలో మైఖేల్, స్నేహా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మైఖేల్ ఇంటికి వెళ్లినా స్నేహా మాత్రం మొబైల్ ఫోన్ చెవి దగ్గర నుంచి కిందకు దించకుండా అవతలి వ్యక్తితో మాట్లాడుతోంది. ఇదే విషయంలో మైఖేల్ తో గొడవపడిన స్నేహా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్త తన మొబైల్ ఫోన్ పగలగొట్టాడని ?
కొంతకాలంగా స్నేహా పుట్టింటిలో ఉండటంతో మైఖేల్ ఆమెకు నచ్చచెప్పి అతని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. తరువాత కూడా స్నేహా మొబైల్ ఫోన్ లో పాతపాట పాడుతూ అవతలి వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. చాలాకాలం ఓపికగా చూసిన మైఖేల్ అతని భార్య స్నేహా మొబైల్ ఫోన్ కిందకు వేసి పీస్ పీస్ చేశాడు. ఆవేవంతో గదిలోకి వెళ్లిన స్నేహా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

హత్య చేశాడని కేసు పెట్టిన స్నేహా ఫ్యామిలీ
మాకు కూతురిని అల్లుడు మైఖేల్ హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని డ్రామాలు ఆడుతున్నాడని స్నేహా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు మైఖేల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని భార్య హత్యకు గురికావడం, భర్త అరెస్టు కావడంతో నాలుగు సంవత్సరాల చిన్నారి అనాథ అయ్యింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications