వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ ఫోన్లు బ్యాంకులుగా, నగదురహితలావాదేవీలకు ప్రోత్సాహకాలు

రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్లు బ్యాంకులు, పర్సులుగా మారనున్నాయి.నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను ప్రోత్సహిస్తోంది. నగదు రహిత లావాదేవీలను చేసిన వారికి ప్రోత్సాహాకాలు ఇవ్వనుండి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :దేశ వ్యాప్తంగా నగదు రహితాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ప్రజలను నగదు రహితం వైపుకు ప్రోత్సహిస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్ల ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలను తీసుకొంటుంది.

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్గంగా ప్రజలు కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కరెన్సీ కోసం వారు బ్యాంకులు,ఎటిఎంల చుట్టూ తిరుగుతున్నారు. అయితే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా నగదు సమస్యలను తీర్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహాకాలను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు నిర్ణయాలను తీసుకొంది.

దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల వైపుకు ప్రజలను మళ్ళించేందుకు గాను ప్రభుత్వం ప్రణాళికలను వేగవంతంగా అమలు చేయనుంది.పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహరంపై అధికారపార్టీని ఇరుకునపెట్టాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రయత్నించాయి. పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ఒక్క కార్యక్రమం చేపట్టకుండానే శీతాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి.

మొబైల్ పోన్లే బ్యాంకులు, పర్సులు

మొబైల్ పోన్లే బ్యాంకులు, పర్సులు

రానున్న రోజుల్లో మొబైల్ బ్యాంకుల ద్వారానే నగదు లావాదేవీలను చేసుకొనేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టెక్నాలజీని వినియోగించుకొంటుంది. స్మార్ట్ పోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల ద్వారా నగదు లావాదేవీలను చేసుకొనేలా ప్రణాళికలు చేస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేసుకొన్న వారికి ప్రోత్సాహకాలను ఇవ్వనుండి. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై లక్కీ డ్రా ద్వారా బహుమతులను ఇవ్వనున్నారు.

ఎన్నికల్లో ప్రధాన ఎజెండా గా మారనుంది

ఎన్నికల్లో ప్రధాన ఎజెండా గా మారనుంది

వచ్చే ఏడాది లో ఉత్తర్ ప్రదేశ్ ,పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ అంశం పధాన ఎజెండా గా మారే అవకాశం ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి విపక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.అయితే పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలకు దీర్ఘకాలంలో ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.అయితే తాత్కాలికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వీటిని విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకొన్నాయి.

పాన్ కార్డుతో బ్యాంకు ఖాతాల లింకు

పాన్ కార్డుతో బ్యాంకు ఖాతాల లింకు

బ్యాంకు లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను బ్యాంకు ఖాతాలను పాన్ కార్డుతో లింక్ చేస్తున్నారు. ఒకే వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా కాని, వాటిని అన్నింటిని కూడ పాన్ కార్డుతో అనుసంధానం చేయాల్సిందే. లేకపోతే ఆ ఖాతాలను స్థంబింపజేయనున్నారు. పాన్ కార్డుతో లింక్ చేయడం వల్ల ఆయా ఖాతాల్లో ఎంత నగదు జమ చేసిన పన్ను కట్టకుండా తప్పించుకోలేరు.

ఆధార్ తో బ్యాంకు ఖాతాల లింకు

ఆధార్ తో బ్యాంకు ఖాతాల లింకు

బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో లింకులు చేయనున్నారు. ఈ ఖాతాలను లింకు చేయడం ద్వారా నిరక్షరాస్యులు కూడ నగదు రహిత లావాదేవీలను వేలిముద్ర ఆధారంగా చేసుకొనే అవకాశం ఏర్పడింది.గ్రామీణప్రాంతాల్లోని ఖాతాదారులకు స్మార్ట్ ఫోన్ లేకపోతే, చదువు రాకపోయినా నగదు లావాదేవీలను కొనసాగించేందుకుగాను బ్యాంకు ఖాతాలను ఆధార్ తో లింకు చేస్తున్నారు. నిరక్షరాస్యులు కూడ నగదు రహిత లావాదేవీలను నిర్వహించే అవకాశం ఉంటుంది.

English summary
mobile pnone will be banks and purse.after demonatesation central governament encourage cashless transactions.who are the pay cahsless transacations central governament pay incentives.an every bank account link with pan card,aadhar cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X