వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద మొబైల్స్ నిషేధం ... కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

శబరిమల అయ్యప్ప దేవాలయం వద్ద మొబైల్ ఫోన్ ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది కేరళ సర్కార్. శబరిమల అయ్యప్ప గుడి ప్రాంగణంలో గర్భ గుడి సమీపంలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. శబరిమల అయ్యప్ప దేవాలయం విషయంలో ఇప్పటికే మహిళా భక్తులు దర్శనం చేసుకునే వివాదం కొనసాగుతుంది. ఇక తాజాగా సెల్ ఫోన్ ల వాడకాన్ని కూడా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం భక్తులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

 శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికి శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికి

Recommended Video

News Roundup : Chidambaram Satires On Nirmala Sitharaman Comments Over Onion Prices !
అయ్యప్పస్వామి దేవాలయ అంతరాలయం చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్

అయ్యప్పస్వామి దేవాలయ అంతరాలయం చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న శబరిమల అయ్యప్పస్వామి దేవాలయ అంతరాలయం చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అత్యంత పవిత్రంగా నిష్టగా పూజాధికాలు నిర్వహించి దర్శించుకునే స్వామికి సంబంధించిన అంతరాలయ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండటంతో భద్రతా పరమైన సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేవస్థానం బోర్డు మొబైల్ ఫోన్లను వాడకూడదని, నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

శబరిమల సౌకర్యాలు అంబుడ్స్‌మన్, జస్టిస్ పి ఆర్ రామన్ సూచన

శబరిమల సౌకర్యాలు అంబుడ్స్‌మన్, జస్టిస్ పి ఆర్ రామన్ సూచన

ఇటీవల, కొంతమంది భక్తులు గర్భగుడి మరియు ప్రధాన స్వామివారి యొక్క వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సౌకర్యాల పర్యవేక్షణ కోసం ఇటీవల శబరిమల ఆలయాన్ని సందర్శించిన దేవస్థానానికి సంబంధించిన అంబుడ్స్‌మన్, జస్టిస్ పి ఆర్ రామన్ అక్కడి సౌకర్యాలను పరిశీలించటంతో పాటు దేవస్థానం వద్ద మొబైల్స్ ను నిషేధించాలని సూచించారు.

గతంలోనూ సెల్ ఫోన్ల వాడకం పై నిషేధం .. కానీ అమలులో విఫలం

గతంలోనూ సెల్ ఫోన్ల వాడకం పై నిషేధం .. కానీ అమలులో విఫలం

సుమారు ఏడాది క్రితం శబరిమల ఆలయంతో సహా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని అన్ని దేవాలయాల వద్ద మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. కానీ దీనిని కఠినంగా ఇప్పటి వరకు అమలు చెయ్యలేదు. కానీ ప్రస్తుతం తాజా పరిణామాల నేపధ్యంలో కఠినంగా అమలు చెయ్యాలని దేవస్థానం బోర్డు భావిస్తుంది .

శబరిమల ఆలయ సమీపంలో సెల్ ఫోన్ల వాడకంపై బ్యాన్

శబరిమల ఆలయ సమీపంలో సెల్ ఫోన్ల వాడకంపై బ్యాన్

పవిత్రమైన మెట్ల మార్గం వైపు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ మాట్లాడటం కానీ, సెల్ఫోన్ వినియోగించి ఫోటోలు తీయడం కానీ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు దేవస్థానం బోర్డ్ ప్రకటించింది. మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తుంది. ఇక ఈ నిర్ణయంతో భక్తులు ఒకింత షాక్ కు గురైనా , ఇప్పటికే పలు దేవాలయాల విషయంలో ఎటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ సైతం పాటిస్తారు అన్న భావన వ్యక్తమవుతుంది.

English summary
Mobile phone use has been banned at Sabarimala Ayyappa temple premises in the view of the misuse of pictures of the temple, especially the sanctum sanctorum and even the deity.Devotees will be advised to keep their mobile phones switched off and those who use a mobile phone at the temple premises will be initially warned and stringent actions like the seizure of phones would be initiated against repeated violators,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X