వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్పొరేట్లకు బానిసలుగా రైతులు - వ్యవసాయ బిల్లులపై రాహుల్ గాంధీ - రాజ్యసభలో రచ్చ

|
Google Oneindia TeluguNews

సంస్కరణల పేరుతో మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులు.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లులు ఆదివారం రాజ్యసభ ముందుకురాగా, అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయి వాదోపవాదాలు జరిగాయి.

రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - 'దళారీ కాంగ్రెస్' వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - 'దళారీ కాంగ్రెస్' వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్

మోదీపై రాహుల్ ఫైర్

మోదీపై రాహుల్ ఫైర్

‘‘రైతులకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ తీసుకొచ్చినవి ముమ్మాటికీ చీకటి బిల్లులే. మార్కెట్ యార్డులు, కిసాన్ మార్కెట్లను కాదని, బయట జరిపే అమ్మకం, కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర ఎలా అందుతుంది? పోనీ, అమ్మే చోటు ఏదైనప్పటికీ, ప్రభుత్వం కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వగలదా?'' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. చీకటి చట్టాల ద్వారా మోదీ... రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. మోదీ కుయుక్తులు విజయవంతం కాకుండా ఈ దేశం కచ్చితంగా అడ్డుకుంటుందని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు.

అది డెత్ వారెంట్.. సంతకం చేయం..

అది డెత్ వారెంట్.. సంతకం చేయం..

వ్యవసాయ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో జరిగిన చర్చలో విపక్ష పార్టీలన్నీ ప్రధానంగా ‘కనీస మద్దు ధర(ఎంఎస్పీ)'పై ఆందోళన వ్యక్తం చేశాయి. పంటలకు గిట్టుబాట ధర కల్పించే ప్రక్రియను మోదీ సర్కారు వదులుకోవాలని ప్రయత్నిస్తున్నదని, వ్యవసాయ బిల్లుల్లో ఎంఎస్పీ ప్రస్తావన లేకపోవడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. వ్యవసాయ బిల్లుల ముసాయిదాను రైతుల పాలిట ‘డెత్ వారెంట్' గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఆ బిల్లుపై తాము సంతకం చేయబోమని స్పష్టం చేసింది.

షాకింగ్‌ : ట్రంప్‌కు విషం పార్సిల్ - తాకితే 36 గంటల్లో ఖతం - ఎన్నికల వేళ కలకలంషాకింగ్‌ : ట్రంప్‌కు విషం పార్సిల్ - తాకితే 36 గంటల్లో ఖతం - ఎన్నికల వేళ కలకలం

Recommended Video

Agriculture Bills 2020 పై కేంద్రం క్లారిటీ Vs రైతుల డిమాండ్లు | Oneindia Telugu
మంత్రికి సవాలు..సెలెక్ట్ కమిటీకి..

మంత్రికి సవాలు..సెలెక్ట్ కమిటీకి..

కొత్త వ్యవసాయ బిల్లుల ద్వారా పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) తొలగిపోనుందని రైతులందరూ ఆందోళన చెందుతున్నారని, ఒకవేళ ప్రభుత్వం ఎంఎస్పీని అంతం చేయకపోతే, పుకార్లపై కేంద్ర మంత్రి రాజీనామా చేస్తారా? అని శివసేన ఎంపీ సవాలు విసిరారు. వ్యవసాయ బిల్లులపై ప్రత్యేక సెషన్ నిర్వహించి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని సేన ఎంపీ సూచించారు. ఆదివారమే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మాజీ ప్రధాని దేవేగౌడ(జేడీఎస్) మాట్లాడుతూ.. కరోనా విలయ సమంలో వ్యవసాయ బిల్లులకు వచ్చిన తొందరేముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యవసాయ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీ పరిశీలకు పంపాలని అకాలీదళ్, శివసేన, బీజేడీ ఎంపీలు డిమాండ్ చేశారు.

English summary
As agriculture-related bills were tabled in the Rajya Sabha, the Congress stepped up its attack on the Centre over the issue and accused it of "running away" from giving legal responsibility for the Minimum Support Price (MSP). Mod is making farmers slaves of corporate houses, tweets Rahul gandhi. Shiv Sena, BJD, Akali Dal want farm bills to be examined by select committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X