వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడిరోడ్డులో బూతులు తిట్టిన ప్రియుడు. డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మోడల్ !

|
Google Oneindia TeluguNews

మైసూరు: ప్రేమించిన ప్రియుడు అందరి ముందు ఢగార్ ( తెలుగులో ఉపయోగించలేని బూతు పదం) అని దూషించాడని ఆవేదతో మోడల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని రాచనగరి మైసూరు నగరంలో జరిగింది.

మోడల్ తో లవ్

మోడల్ తో లవ్

మైసూరు నగరంలో ధన్యా (19) అనే మోడల్ నివాసం ఉంటున్నది. ధన్యా మోడలింగ్ చూస్తూ షార్టు ఫిలిమ్స్ లో నిటిస్తోంది. మైసూరులోని మేటగెళ్ళి ప్రాంతానికి చెందిన బీన్ అనే యువకుడు, ధన్యా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ధన్యా కుటుంబ సభ్యులకు తెలిసింది.

పెళ్లి కోసం చర్చలు

పెళ్లి కోసం చర్చలు

పెళ్లి విషయం మాట్లాడటానికి బీన్ ను ఇంటికి పిలుచుకురావాలని కుటుంబ సభ్యులు ధన్యాకు చెప్పారు. అయితే బీన్ ధన్యా ఇంటికి వెళ్లడానికి అంగీకరించలేదు. ఇంటికి పిలిచినా రాలేదని కోపంతో ధన్యా ప్రియుడు బీన్ తో గొడవపడింది.

నడిరోడ్డులో బూతులు

నడిరోడ్డులో బూతులు

మే 24వ తేదీ గురువారం ధన్యా ఆమె తండ్రి నిర్వహిస్తున్న షాప్ ముందు నిలబడి ఉన్న సమయంలో అందరి ముందు బీన్ ఆమెను ఢగార్ అంటూ నోటీతో చెప్పలేని బూతులు తిట్టాడు. అందరి ముందు తనను అంతమాటలు అనడంతో ధన్యా సహించలేకపోయింది.

డెత్ నోట్, ఆత్మహత్య

డెత్ నోట్, ఆత్మహత్య

ప్రియుడు బూతులు తిట్టాడనే అవమానంతో నేరుగా ఇంటికి వెళ్లిన ధన్యా డోత్ నోట్ రాసి పెట్టి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ధన్యా ప్రియుడు బీన్ పరారైనాడు. మైసూరు నగరంలోని విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Mysuru Model Who Committed Suicide. On May 24, Dhanya committed suicide by hanging at the age of 19. Many of models who killed themselves
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X