వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: డ్రగ్స్ మత్తులో తల్లిని చంపిన మోడల్, గర్ల్ ఫ్రెండ్ ఆపినా ఆగలేదు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఓషివారా పోలీసులు 23 ఏళ్ల మోడల్ లక్ష్యసింగ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అతను తన తల్లి సునిత (45)ను హత్య చేశాడు. వారు డ్రగ్స్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తల్లితో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అతను తల్లిని చంపేశాడు.

ఆర్థిక సమస్యల విషయంలోనూ తల్లీ కొడుకుల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు చెప్పారు. ఇది తీవ్రస్థాయికి చేరి తల్లిని బలంగా బాత్రూంలోకి నెట్టడంతో ఆమె తల వాష్ బేసిన్‌కు తగిలి చనిపోయిందని చెప్పారు. ఉదయం బాత్రూం తలుపు తెరవగానే సునీత చనిపోయి ఉందన్నారు.

కొడుకుతోపాటు అతని కాబోయే భార్య ఆ సమయంలో ఇంట్లోనే ఉందని చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

చిప్స్ వేయించుకోవడానికి ఓవెన్ తెరవగానే మూడు అడుగుల పాముచిప్స్ వేయించుకోవడానికి ఓవెన్ తెరవగానే మూడు అడుగుల పాము

Model held for mothers death tried to get dads soul out of her

బుధవారం అర్ధరాత్రి తల్లి సునిత, కొడుకు లక్ష్య, అతని గర్ల్ ఫ్రెండ్ ఐష్‌ప్రియా బెనర్జీల (22) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పుడు వారితో పాటు ఇద్దరు సర్వెంట్లు కూడా ఉన్నారు. సునీత డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో లక్ష్య ఆగ్రహం పట్టలేక చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ముఖంపై కొట్టాడు. కడుపు, వీపుపై కొట్టాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న గర్ల్ ఫ్రెండ్ అతనిని ఆపేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ వినలేదు. తల్లిని కొట్టిన తర్వాత అతను బాత్రూం గదిలో వేసి గడియ పెట్టాడు. ఉదయం లేచేసరికి ఆమె చనిపోయింది.

English summary
The Oshiwara police arrested 23 year old Lakshya Singh on Friday for killing his mother, Sunita (45), following a heated argument early on Thursday morning. During interrogation, Lakshya told the police that he had pushed his mother after gruesomely assaulting her for acting weird after consuming drugs on Wednesday midnight. The police have booked Lakshya for culpable homicide not amounting to murder (Section 304) of the Indian Penal Code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X