వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడళ్లకు కోర్టులో ‘ఆడిషన్స్’ నిర్వహించిన దావూద్ అనుచరుడు

|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ముస్తాఫా దొస్సా ముంబై కోర్టు ఆవరణలోనే మోడల్స్‌కు ఆడిషన్ టెస్టులు నిర్వహించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం.

కానీ, కోర్టు ఆవరణలో ఈ రకం సంఘటన చోటుచేసుకోవడం పలు విమర్శలకు దారి తీసింది.
పలుకేసుల్లో కోర్టుకు హాజరవుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన దొస్సా.. దుబాయ్‌లోని ఓ జ్యువెల్లరీ షాప్ వాణిజ్య ప్రకటన కోసం ఎనిమిది మంది మోడల్స్‌ను ముంబైలోని స్థానిక కోర్టులో ఇంటర్వ్యూ చేశాడు.

వారిలో ముగ్గుర్ని ఎంపిక చేయడంతో అతని అనుచరుడు సయ్యద్ లక్ష రూపాయల నగదును అడ్వాన్సుగా ముట్టజెప్పాడు. అక్కడి నుంచి ఓ మోడల్ తిరిగి వెళ్తుండగా నగదుతోపాటు మొబైల్ ఫోన్‌ను దొస్సా అనుచరులు లూటీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Models allegedly 'auditioned' for Dawood's associate inside Mumbai court

బాధిత యువతి శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి తన వద్ద ఉన్న ఫోన్, లక్ష రూపాయలను తీసుకెళ్లారని, క్రైం బ్రాంచ్‌కు వచ్చి తీసుకొమ్మన్నారని తెలిపింది. అయితే తాను అక్కడికి వెళ్లి అడిగితే.. తమ పోలీసులెవరూ అలాంటి పని చేయలేదని చెప్పారని తెలిపింది.

అయితే దొస్సా అనుచరులే ఈ పని చేసివుంటారని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. కాగా, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ మోహన్ దహికర్ తెలిపారు. మాఫియా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

English summary
Mumbai police are probing a startling revelation made by a model who has claimed that she and two other girls were selected for front desk job at a Dubai jewellery store by gangster Mustafa Dossa inside a courtroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X