• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొవిడ్-19 వ్యాక్సిన్:మోడెర్నా ధర ఖరారు -ఒక్కో డోసు రూ.3వేల లోపే -భారీగా ఆర్డర్లు

|

కొవిడ్-19 వ్యాక్సిన్ల రూపకల్పనలో అమెరికా బయోటెక్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఫ్రంట్ రన్నర్లుగా పేరుపొందిన ఫైజర్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు 'ఎమర్జెన్సీ యూజ్' ట్యాగ్ కోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, ప్రఖ్యాత మోడెర్నా బయోటెక్ తాము రూపొందించిన వ్యాక్సిన్ ధరను ఖరారు చేసింది.

  COVID-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ పంపిణీకి వీలుగా ధరలను ప్రకటించిన Moderna సంస్థ!

  మోడెర్నా బయోటెక్ కంపెనీ.. తాము అభివృద్ధి చేసిన కొవిడ్ -19 వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తదుపరి అనుమతుల కోసం ప్రయత్నిస్తోన్న ఈ సంస్థ.. వ్యాక్సిన్ పంపిణీకి వీలుగా ధరలను సైతం వెల్లడించింది. ఒక్కో డోసుకు కనీసం 25 డాలర్ల నుంచి గరిష్టంగా 37 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1800 నుంచి రూ.2750లోపు) వసూలు చేస్తామని మోడెర్నా సంస్థ సీఈవో స్టెఫనీ బాన్సెల్‌ మీడియాకు తెలిపారు.

  భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహా

  Moderna to charge 25-37 dollar for COVID-19 vaccine, says CEO

  ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ స్టోరేజీకి మైన్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత తప్పనిసరి కావడం, చాలా దేశాలకు అలాంటి కోల్డ్ చైన్ సిస్టమ్ లేకపోవడంతో మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ఆసక్తి రెట్టింపైంది. వ్యాక్సిన్ అమ్మకాలకు సంబంధించి జులై నుంచే యురోపియన్ యూనియన్(ఈయూ) తో చర్చలు జరుపుతూ వచ్చామని, గత వారం ధరలపైనా చర్చలు జరిగాయని, ఒక్కో డోసును 25 డాలర్ల కంటే తక్కువకు ఇస్తే మిలియన్ల డోసులు కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఈయూ స్పష్టం చేసినట్టు మోడెర్నా సీఈవో బాన్సెల్‌ తెలిపారు.

  మోడెర్నా టీకా మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా.. mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ముందస్తు ఫలితాల విశ్లేషణలో వెల్లడైందని ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా సమర్థతను తమ వ్యాక్సిన్‌ చేరుకుందని మోడెర్నా వ్యాఖ్యానించింది. తొలి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5 శాతం సమర్థతతో వ్యాక్సిన్‌ పనితీరు కనబరిచినట్లు వెల్లడించింది.

  కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్

  Moderna to charge 25-37 dollar for COVID-19 vaccine, says CEO

  అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) నియమించిన డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు (డీఎస్ఎంబీ) నిపుణుల బృందం ఇప్పటివరకు మోడెర్నా నిర్వహించిన మూడోదశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించి ఈవిషయాన్ని వెల్లడించింది. మొత్తం 30వేల మంది వాలంటీర్లపై మోడెర్నా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి.

  వీరిలో 15వేల మందికి ప్లాసీబో (డమ్మీ) చికిత్స.. మరో 15వేల మందికి వ్యాక్సిన్‌ ( ఎంఆర్‌ఎన్‌ఏ-1273) అందజేశారు. ప్లాసీబో ఇచ్చిన 90 మందిలో కరోనా లక్షణాలు బయటపడగా, వారిలో 11 మందిలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. వ్యాక్సిన్‌ గ్రూపులోని వాలంటీర్లలో ఐదుగురిలోనే కరోనా లక్షణాలు బయటపడినా వైరస్ తీవ్రత జాడ కనిపించలేదు.

  English summary
  Moderna will charge governments between $25 and $37 per dose of its COVID-19 vaccine candidate, depending on the amount ordered, Chief Executive Stephane Bancel told German weekly Welt am Sonntag (WamS). “Our vaccine, therefore, costs about the same as a flu shot, which is between $10 and $50,” he was quoted as saying.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X