వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్‌కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్‌తోనే కేధార్‌నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీ

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్‌కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల తర్వాత నిలిపివేశారు...ఆదివారం ప్రారంభమైన మన్‌కీ బాత్‌లో తనను రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు..అనంతరం పలు అంశాలను ప్రస్థావించారు.కాగా మన్‌కీ బాత్‌ను తిరిగి ప్రారంభించడం పై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కేదారీ‌నాథ్ యాత్ర నా ఇన్నర్ ఫీలింగ్...

కేదారీ‌నాథ్ యాత్ర నా ఇన్నర్ ఫీలింగ్...

ఇక రెండవ సారి ఎన్నికల తర్వాత తిరుగులేని మెజారీటి సాధించిన మోడీ తన మన్‌కీ బాత్‌లో తాను ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే,ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఆయన కేదార్‌‌నాథ్ ఆలయానికి వెళ్లడం పై పలు విమర్శలు రావడంతో దానిపై మోడీ స్పందించారు..కేదార్‌నాథ్‌ ఆలాయానికి వ్యక్తిగతంగా వెళ్లాలని, అయితే దాన్ని కూడ కొంతమంది వ్యక్తులు రాజకీయం చేశారని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి వినియోగం పై అప్రమత్తంగా ఉండాలని పిలుపు...

నీటి వినియోగం పై అప్రమత్తంగా ఉండాలని పిలుపు...

దీంతోపాటు ప్రస్థుతం పలు రాష్ట్ర్రాలు ఎదుర్కోంటున్న నీటీ కొరతను ప్రధాని ప్రస్థావించారు.నీటీని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు నీటీని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఇందులో భాగంగానే నీటీనీ ఆదా చేసే వాటర్ హార్వేస్టింగ్ పద్దతులను అందరు అవగాహాన చేసుకోవాలని అన్నారు.ఈ సంధర్భంగా ఓక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీటీని సంరక్షించుకుంటున్న వారు స్చఛ్చ భారత్ ఉద్యమంల నీటిని సంరక్షన ఉద్యమంలా కొనసాగాలని ప్రధాని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలోనే నీటీ సంరక్షణకు సంబంధించి చదువుకున్న ప్రతి ఒక్కరు ఇతరులకు వివరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే పోరుబందర్‌ వెళ్లే అవకాశం వస్తే అక్కడ మహాత్మా గాంధీ ఇంటి సమీపంలో ఉండే 200 ఏళ్ల నాటి బావిని చూసి రమ్మంటు చెప్పారు..అక్కడ స్థానికులు ఇప్పటికీ బావిని సంరక్షించుకుంటున్నారని చెప్పారు.

ఎన్నికలు ప్రజలు పండగలాగా స్వీకరించారు.

ఎన్నికలు ప్రజలు పండగలాగా స్వీకరించారు.

ఇక ఇటివల జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడ మోడీ ప్రస్థావించారు. ప్రపచంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారత దేశం ఉందని చెప్పిన మోడీ ,ఎన్నికలు ప్రతి ఒక్కరి భాగస్వామ్యయంతోనే విజయ వంతం అయ్యాయని చెప్పారు..ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో మొత్తం 61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాడాన్ని ఆయన ప్రశంశించారు.ఈ నేపథ్యంలోనే ఆరుణచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతంలో కేవలం ఒక్క ఓటరు కోసం పోలీంగ్ బూతును ఏర్పాటు చేశారని అన్నారు...కాగా ఎన్నికలకు ప్రజలు ఒక పండగల చూసుకుని తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకున్నారని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday addressed the nation through his monthly programme 'Mann ki Baat' making it the first broadcast of the programme after he assumed power for the second time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X