వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ తరహా మోడల్ అనుసరించండి, సీఎంలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం

|
Google Oneindia TeluguNews

పంజాబ్ తరహాలో ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పంజాబ్‌లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఒకవేళ బయటికి వస్తే కఠినంగా ఫైన్ విధించడంతో జనాలు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్పరెన్స్‌లో మోడీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ కొన్ని రాష్ట్రాలు సీఎంలు, లెప్టినెంట్ గవర్నర్ల నుంచి అభిప్రాయం తీసుకున్నారు.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 3.4 లక్షలకు చేరగా.. మృతుల సంఖ్య 9900కి చేరింది. ప్రతీరోజు 10 నుంచి 11 వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల సీఎం, లెప్టినెంట్ గవర్నర్లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంజాబ్, కేరళ, గోవా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఈశాన్య భారత రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల లెప్టినెంట్ గవర్నర్లతో సమావేశమయ్యారు.

Modi Asks States to Adopt Punjabs Model, Strictly Advises Not to Step Out without Masks

వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్.. రాష్ట్రాలు, కేంద్రప్రాంతపాలిత సీఎంలు, లెప్టినెంట్ గవర్నర్లతో బుధవారం సమావేశమవుతారు. ఇదీ ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో ఆరు, ఏడో సమావేశం కానున్నది. మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సీఎంల అభిప్రాయం తీసుకుంటూనే ఉన్నారు.

ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. కరోనా వైరస్ లక్షణాలతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. కానీ ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. ఇదివరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ లక్షణాలతో పరీక్ష చేయించుకోగా... నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
PM Modi will hold a video-conference with chief ministers, Lt governors and administrators of 21 states and Union territories today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X