వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆపరేషన్ కశ్మీర్' కు మోదీ ముహూర్తం..? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ప్రధాని..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కాశ్మీర్ అంశం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికి అంతుచిక్కని ప్రణాళికతో కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కరం చూపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా 'ఆపరేషన్ కశ్మీర్' కు ప్రధాని మోదీ ముహూర్తం పెట్టారా ? గత రెండు వారాలుగా సాగుతున్న పరిణామాలతో ఏం జరగబోతోంది ? మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు ? ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో, మోదీ తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాల పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ? తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.

ఆపరేషన్ కశ్మీర్ కు ప్రధాని ముహూర్తం..! వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మోదీ..!!

ఆపరేషన్ కశ్మీర్ కు ప్రధాని ముహూర్తం..! వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మోదీ..!!

అమరనాథ్ యాత్రికులకు రక్షణ కల్పించేందుకు 40వేల మంది సైనికులు కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలోని పోలీసులు, భద్రతాసిబ్బంది, సైనికులకు వీరు అదనం. మొన్నామధ్యన పదివేలమందిని, ఇప్పుడు మరో పాతికవేలమంది కశ్మీర్ కు పంపుతున్నారు. ఇటీవల కశ్మీర్ ను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సందర్శించి, ఢిల్లీకి వెళ్లారు. ఆ తరువాతనే, కశ్మీర్ విషయంలో మోదీ ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదనపు సైన్యాన్ని అక్కడకు ఎందుకు పంపుతున్నారన్న అంశంపై రకరకాలుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. వీటన్నింటి సారాంశం ఒక్కటే. 'చాలా చాలా కీలకమైన నిర్ణయమే ఉంటుంది. దాని పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి'.

ఆర్టికల్ 35ఏ, 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు..!!

ఆర్టికల్ 35ఏ, 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు..!!

సైన్యాన్ని భారీ ఎత్తున మొహరిస్తున్న కేంద్రం..! ఆర్టికల్ 35ఏ, 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు..!!
దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా.. ప్రత్యకంగా చూసేలా చేస్తున్న ఆర్టికల్ 35ఏ.. 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నంతనే కశ్మీర్ లోయలో విపరిణామాలు చోటు చేసుకునే వీలున్న నేపథ్యంలో, వాటిని అడ్డుకునేందుకు వీలుగా సైన్యాన్ని భారీ ఎత్తున మొహరిస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ 2014.. 2019 ఎన్నికల ప్రణాళికను చూపిస్తున్నారు.

వేలది మంది సైన్యం కశ్మీర్ కు తరలింపు..! అంతా వ్యూహాత్మకమే..!!

వేలది మంది సైన్యం కశ్మీర్ కు తరలింపు..! అంతా వ్యూహాత్మకమే..!!

జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలుగా చేసి, జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా, కశ్మీర్ లోయను, లద్దాఖ్ ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఊహాగానాలేనని, ప్రజలు పట్టించుకోవద్దని గవర్నర్ సత్యపాల్ మాలిక్ కొట్టిపారేశారు. వేలమంది సైన్యాన్ని కశ్మీర్ వ్యాలీకి పంపటం వెనుక.. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీతోపాటు కశ్మీర్ లో కూడా ప్రధాని ఎగురవేస్తారన్న మాట వినిపిస్తోంది. దానిని తీవ్రవాదులు అడ్డుకునే ప్రమాదం ఉన్నందునే ఇంత భారీగా సైన్యాన్ని తరలిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

 పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం..! తెగేసి చెప్తున్న కేంద్రం..!!

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం..! తెగేసి చెప్తున్న కేంద్రం..!!

పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులకు ఓటింగ్ హక్కులు కల్పిస్తారన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. కశ్మీర్ లోని ఒక వర్గం దీర్ఘకాలంగా చేస్తున్న ఈ డిమాండును ముందుకు తీసుకొస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత, కశ్మీర కు సంబంధించి మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుందన్నది మరొక వాదన. ఆ తదుపరి పరిణామాలకు అధిగమించేందుకు ప్రభుత్వం ముందస్తుగా బలగాలను తరలిస్తోందన్నది ఈ వాదన సారాంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగమని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న అర్థం వచ్చేలా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే.. ఆ దిశగా ఏదైనా సంచలన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకోబోతోందన్నది ఇంకొక వాదన. వీటన్నింటి సారాంశం ఒక్కటే. 'చాలా చాలా కీలకమైన నిర్ణయమే ఉంటుంది. దాని పేరే.. ఆపరేషన్ కశ్మీర్. దాని పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి'.

English summary
Prime Minister Narendra Modi seems to be strategically stepping towards the Kashmir aspect. He was pushing for a permanent solution to the Kashmir issue with a plan which was elusive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X