వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక గేమ్ వెనుక ప్రధాని నరేంద్ర మోడీ: సిద్ధరామయ్య, స్టాలిన్ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడారు. కర్ణాటకలో జరుగుతున్న గేమ్ వెనుక మొత్తం నరేంద్ర మోడీ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికి అతడే కీలకం అన్నారు.

గుజరాత్ దెబ్బ కర్ణాటకలో పడింది: దేవేగౌడకు బీజేపీ టిట్ ఫర్ టాట్గుజరాత్ దెబ్బ కర్ణాటకలో పడింది: దేవేగౌడకు బీజేపీ టిట్ ఫర్ టాట్

తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని సిద్ధరామయ్య చెప్పారు. మేం ఎలాంటి అభద్రతాభావంలో లేమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలను కలుపుకుంటే తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని వెల్లడించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప
మూడోసారి.. ధన్యవాదాలు

మూడోసారి.. ధన్యవాదాలు

తాము అయిదేళ్ల పాటు కర్ణాటకను పాలిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప గురువారం ప్రకటించారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని ఆమె రేపటిలోగా తన అభిప్రాయాన్ని చెప్తారన్నారు. బీజేపీకి మద్దతిచ్చి గెలిపించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి తనను ముఖ్యమంత్రిగా చేసినందుకు కన్నడ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు అన్నారు.

ప్రమాణ స్వీకారం సమయంలో

కాంగ్రెస్‌, జేడీఎస్‌ల పొత్తు అక్రమమని యడ్యూరప్ప చెప్పారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం, వారి శ్రేయస్సు కోసం పని చేస్తుందని వెల్లడించారు. రైతుల కోసం తాను పని చేస్తానని చెప్పేందుకు ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన ఆకుపచ్చ రంగు శాలువా వేసుకుని ప్రమాణం చేశారు.

మనస్సాక్షి మేరకు ఓటు వేయాలని అడుగుతా

బల నిరూపణపై తనకు నమ్మకం ఉందని యెడ్డీ చెప్పారు. తమ ప్రభుత్వం అయిదేళ్ల పాటు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలను తమ మనస్సాక్షి మేరకు ఓటు వేయాలని కోరతానని, ప్రజల తీర్పును గౌరవించాలని అడుగుతానని తెలిపారు. తాను న్యాయస్థానాన్ని గౌరవిస్తానని, సుప్రీం కోర్టులో ఉన్న అంశాలపై స్పందించనని యెడ్డీ పేర్కొన్నారు.

స్టాలిన్ ఆగ్రహం

కర్ణాటకలోని పరిణామాలపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం అన్నారు. అలాగే ఏకపక్ష నిర్ణయం అన్నారు. ఇది బేరసారాలకు వీలు కల్పించడమే అన్నారు. ప్రజస్వామ్య పునాదులను ఇది కూల్చి వేస్తుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిస్థితులను ప్రస్తావించారు. సభలో మెజారిటీ లేకపోయినా, అవినీతి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ సంస్థలు, విలువలు ప్రమాదంలో పడ్డాయన్నారు.

English summary
Former Karnataka CM Siddaramaiah remarked, "Modi is the main guy... He is behind all these games."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X