వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24-9-24: అమిత్ షాకు హోమ్‌, రాజ్‌నాథ్‌కు ర‌క్ష‌ణ‌, నిర్మ‌ల‌కు ఆర్థికం! నరేంద్ర మోడీ 2.O టీమ్ ఇదే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో వ‌రుస‌గా రెండోసారి అధికారాన్ని చేప‌ట్టిన నరేంద్ర మోడీ ప్ర‌భుత్వంలోని కొత్త మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఓ నోటిఫికేష‌న్‌ను జారీ చేశారు. ఊహించిన‌ట్టే అమిత్ షాకు హోమ్ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌ల‌ను అప్పగించారు. ఇప్ప‌టిదాకా ఆ శాఖ‌ను ప‌ర్య‌వేక్షించిన రాజ్‌నాథ్ సింగ్ చేతికి ర‌క్ష‌ణ‌శాఖ ప‌గ్గాల‌ను ఇచ్చారు.

ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిగా కొన‌సాగిన నిర్మ‌లా సీతారామ‌న్‌కు ఆర్థిక‌శాఖకు మంత్రిగా చేశారు. ఆరోగ్య రీత్యా తాను కేంద్ర మంత్రివ‌ర్గంలో చేర‌బోనంటూ అరుణ్ జైట్లీ త‌ప్పుకొన్న విష‌యం తెలిసిందే. దీనితో ఆర్థిక‌శాఖ‌ను నిర్మ‌లా సీతారామ‌న్‌కు కేటాయించారు. తెలంగాణ నుంచి కేబినెట్ ఎంపికైన జీ కిష‌న్ రెడ్డికి కేంద్ర హోమ్ శాఖ స‌హాయ‌మంత్రిని చేశారు. గ‌తంలో ఇదే శాఖ‌ను తెలంగాణ‌కే చెందిన సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు ప‌ర్య‌వేక్షించిన విష‌యం తెలిసిందే.

మొత్తం 24 మంది కేబినెట్, తొమ్మిది మంది స్వతంత్ర హోదా, 24 మంది సహాయ మంత్రులకు శాఖలను కేటాయించారు.

మంత్రులు, వారి శాఖల పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

మంత్రులు, వారి శాఖల పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

  • న‌రేంద్ర మోడీ :ప్ర‌ధాన‌మంత్రి, అణు విద్యుత్‌, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌, మంత్రుల‌కు కేటాయించ‌ని ఇత‌ర శాఖ‌లు
  • రాజ్‌నాథ్ సింగ్ :ర‌క్ష‌ణ శాఖ‌
  • అమిత్ షా :హోమ్,
  • నితిన్ గ‌డ్క‌రీ : రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు, సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు
  • డీవీ స‌దానంద గౌడ :ఎరువులు, ర‌సాయ‌నాలు
  • నిర్మ‌లా సీతారామ‌న్ : ఆర్థికం, కార్పొరేట్ వ్య‌వ‌హారాలు
  • రామ్ విలాస్ పాశ్వాన్ :వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ
  • నరేంద్ర సింగ్ తోమ‌ర్ :వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
  • రవిశంకర్ ప్రసాద్ :న్యాయం, చట్టాలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ
  • థావర్ చంద్ గెహ్లాట్ :సామాజిక న్యాయం, సాధికారికత
  • డాక్టర్ ఎస్ జైశంకర్ :విదేశీ వ్యవహారాలు
  • డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ :మానవ వనరుల అభివృద్ధి
  • అర్జున్ ముండా :గిరిజన సంక్షేమం
  • స్మృతి ఇరానీ :మహిళా, శిశు సంక్షేమం, జౌళి
  • డాక్టర్ హర్షవర్ధన్ :ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్
  • ప్రకాశ్ జవదేకర్ : పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు, సమాచార-ప్రసారాలు
  • పియూష్ గోయల్ :రైల్వే, వాణిజ్యం-పరిశ్రమలు
  • ధర్మేంద్ర ప్రధాన్ :పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు
  • ముఖ్తార్ అబ్బాస్ నక్వీ :మైనారిటీ వ్యవహారాలు
  • ప్రహ్లాద్ జోషి :పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
  • డాక్టర్ మహేంద్రనాథ్ పాండే : నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమలు
  • హర్ సిమ్రత్ కౌర్ బాదల్ :ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
  • అరవింద్ గణపత్ సావంత్ : భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్
  • గిరిరాజ్ సింగ్ : పశుసంవర్ధకం, పాడి పరిశ్రమలు, చేపల ఉత్పత్తి పరిశ్రమలు
  • గజేంద్ర సింగ్ :షెఖావత్ జల్ శక్తి
  • స్వతంత్ర హోదా కింద కేటాయించిన శాఖలు..

    స్వతంత్ర హోదా కింద కేటాయించిన శాఖలు..

    • సంతోష్ కుమార్ గంగ్వార్: కార్మిక, ఉపాధి కల్పన
    • రావ్ ఇందర్ జిత్ సింగ్ :ప్రణాళికలు, పథకాల అమలు, గణాంకాలు
    • శ్రీపాద్ యశోనాయక్ :రక్షణ శాఖ, ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయూష్)
    • డాక్టర్ జితేంద్ర సింగ్ :ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణ, అణువిద్యుత్, అంతరిక్ష పరిశోధన, పర్సనల్ అండ్ గ్రీవెన్సెస్
    • కిరణ్ రిజిజు :యువజన వ్యవహారాలు, క్రీడలు, మైనారిటీ వ్యవహారాలు
    • ప్రహ్లాద్ సింగ్ పటేల్: సాంస్కృతికం, పర్యాటకం
    • రాజ్ కుమార్ సింగ్ : విద్యుత్, నూతన, పునర్ వినియోగ ఇంధన వనరులు, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమలు
    • హర్ దీప్ సింగ్ :పూరి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, పౌర విమానయానం, వాణిజ్యం-పరిశ్రమలు
    • మన్ సుఖ్ మాండవీయ :షిప్పింగ్, ఎరువులు, రసాయనాలు
    • సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు.

      సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు.

      • ఫగ్గన్ సింగ్ కులస్తే ఉక్కు
      • అశ్వినీ కుమార్ చౌబే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
      • అర్జున్ మెఘవాల్ పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్
      • జనరల్ రిటైర్డ్ వీకే సింగ్ రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
      • క్రిషన్ పాల్ సామాజిక న్యాయం, సాధికారికత
      • రావ్ సాహెబ్ దాదారావు దాన్వే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
      • జీ కిషన్ రెడ్డి హోమ్
      • పురుషోత్తం రుపాలా వ్యవసాయం, రైతాంగ సంక్షేమం
      • రామ్ దాస్ అథవాలే సామాజిక న్యాయం, సాధికారికత
      • సాధ్వీ నిరంజన్ జ్యోతి గ్రామీణాభివృద్ధి
      • బాబుల్ సుప్రియో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు
      • సంజీవ్ కుమార్ బలియాన్ పశు సంవర్ధకం, పాడి పరిశ్రమలు, చేపల ఉత్పత్తులు
      • ధోత్రే సంజయ్ శ్యామ్ రావు మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ
      • అనురాగ్ ఠాకూర్ ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు
      • సురేష్ అంగడి చెన్నబసప్ప రైల్వేలు
      • నిత్యానంద రాయ్ హోమ్
      • రతన్ లాల్ కఠారియా జల్ శక్తి, సామాజిక న్యాయం, సాధికారికత
      • వీ మురళీధరన్ విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
      • రేణుకా సింగ్ సరుత గిరిజన సంక్షేమం
      • సోమ్ ప్రకాశ్ వాణిజ్యం, పరిశ్రమలు
      • రామేశ్వర్ తేలి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
      • ప్రతాప్ చంద్ర సారంగి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమలు, చేపల ఉత్పత్తులు
      • కైలాష్ చౌదరి వ్యవసాయం, రైతులు సంక్షేమం
      • దేబొశ్రీ చౌదరి మహిళా, శిశు సంక్షేమం

English summary
Cabinet portfolios announced. Rajnath Singh new Defence Minister, Amit Shah now Home Minister, Nirmala Sitharaman Finance Minister and S Jaishankar new External Affairs Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X