వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ: రైతులకు గుడ్ న్యూస్... కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో మోడీ సర్కార్ రైతులకు కానుక ఇచ్చింది. పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో వరి, ఖరీఫ్ పంటలకు సంబంధించిన మద్దతు ధరను పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.1500 కోట్లు భారం పడనుంది.

2014 ఎన్నికల సమయంలో రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర 1.5రెట్లు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌లో కో ప్రకటన చేసింది. దీనికి అనుబంధంగానే కేంద్రం ఈరోజు కనీస మద్దతు ధర పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరీఫ్‌లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. వరి సాధారణ గ్రేడ్‌కు కనీస మద్దతు ధర రూ.200 పెంచగా... అది ఇప్పుడు కొత్తగా క్వింటాల్ రూ. 1750కు చేరింది. గ్రేడ్ ఏ వెరైటీ పై రూ.160 పెంచింది. దీంతో అది కూడా రూ. 1750కు చేరింది.

Modi cabinet increases the MSP a head of elections

కనీస మద్దతు ధర పెంచకముందు సాధారణ వరి ధర క్వింటల్‌కు రూ. 1550 పలుకగా... అదే గ్రేడ్ ఏ వరి ధర రూ.1590 పలికింది. ఇక భారత ఆహార సంస్థ రైతుల నుంచి ఈ పంటలు ధాన్యాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆహార భద్రత చట్టం కింద వీటిని సరఫరా చేస్తుంది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన కనీస మద్దతు ధర సీఏసీపీ ఇచ్చిన మద్దతు ధరకంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
The Union cabinet meeting which was held to decide on Minimum Support Price (MSP) hike of paddy, kharif crops on Wednesday, has decided to double the MSP for paddy what it was last year. The proposed hike is estimated to cost the taxpayers a whopping amount of Rs 15,000 crore annually.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X