వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త క్యాబినెట్‌కు ముహుర్తం... నేడు కేంద్ర క్యాబినెట్ రద్దు...

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారీ గెలుపును స్వంతం చేసుకోవడంతో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మరోసారి బీజేపీ కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది..ఈనేపథ్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న మంత్రిమండలిని నేడు సాయంత్రం రద్దు చేయనున్నారు. నేడు సాయంత్రం సమావేశం కానున్న మంత్రిమండలి రద్దుకు సంబంధించి తీర్మాణం చేసి రాష్ట్ర్రపతికి పంపనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు.

సాయంత్రం క్యాబినెట్ రద్దు..

సాయంత్రం క్యాబినెట్ రద్దు..

క్యాబినెట్ రద్దుకు సంబంధించి సాయంత్రం తీర్మాణం చేసి ఆ కాపీనీ రాష్ట్ర్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు అందించనున్నారు.అనంతరం రాష్ట్ర్రపతి లోకసభ రద్దయినట్టు ప్రకటిస్తారు. కాగా జూన్ 3లోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి.ఇందుకు అనుగుణంగా రాష్ట్ర్రపతి చర్యలు తీసుకోనున్నారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గెలిచిన అభ్యర్థుల లిస్టును ఎన్నికల కమీషన్ అందించనుంది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.

జూన్ 3లోగా ప్రభుత్వం ఏర్పాటు..

జూన్ 3లోగా ప్రభుత్వం ఏర్పాటు..

కాగ మే 30 కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోడీ సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కోత్త క్యాబినెట్‌కు కూడ రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు నేడు మంత్ర్రులతో సమావేశం కానున్నారు. ఇక కొత్త క్యాబినెట్ విషయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఎంపీలు గెలివగా..ఒక్క బీజేపీ పార్టీ నుండే 303 మంది సభ్యులు గెలుపోందారు.వీళ్లతోపాటు భాగస్వామ్య పార్టీల నుండి మరో 50 స్థానాల్లో అభ్యర్థులు గెలుపోందారు..కాబట్టి వారికి కూడ భాగస్వామ్యం కల్పించే అవకాశాలు కూడ ఉన్నాయి. ఈసారి ఎక్కువగా యువతను క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమిత్ షా ఢిఫెన్స్ మినిస్ట్ర్రీ

అమిత్ షా ఢిఫెన్స్ మినిస్ట్ర్రీ

కాగా క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ప్రస్థుత ప్రభుత్వంలో ఆర్దిక మంత్రిగా బాద్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీకి ఈసారీ స్థానం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.దీంతో ఢిఫెన్స్ మినిస్టర్,గా ఉన్న నిర్మాలా సీతారామన్‌ను తప్పించి ఢిఫెన్స్ మంత్రిత్వశాఖను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ప్రస్థుత ఎన్నికల్లో జాతీయ భావం దేశ భద్రత అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి.దీంతో మోడీ అత్యంత సన్నిహితుడైన అమిత్ షాకు ఈసారీ ఢిఫెన్స్ మినిస్ట్ర్రీని కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్ర్రాల నుండి కిషన్ రెడ్డి ఖాయంగా మంత్రిపదవి...

తెలుగు రాష్ట్ర్రాల నుండి కిషన్ రెడ్డి ఖాయంగా మంత్రిపదవి...

ఇక తెలుగు రాష్ట్ర్రాల్లో తెలంగాణ నుండే బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో వైసీపీ దెబ్బకు చతికిలపడింది బీజేపీ.దీంతో అక్కడ బీజేపీకి ప్రాతినిథ్యం లేని పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు తమిళనాడులో కూడ బీజేపీ ప్రాతినిథ్యం లేకపోవడంతో ముఖ్యంగా నరేంద్ర మోడీకి సన్నిహితుడైన కిషన్ రెడ్డికి క్యాబినెట్‌లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. కాగా సికింద్రాబాద్ నుండి 2014లో గెలిచిన దత్తాత్రేయకు మంత్రిపదవి దక్కింది. దీంతో ఆయన స్థానంలో కిషన్ రెడ్డి గెలవడంతోనే ఆయనకు మంత్రిపదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary
The people of India have chosen their leader. The Bharatiya Janata Party has got a historic mandate in the 17th Lok Sabha elections. But who is going to hold which portfolio in the new Modi Cabinet? The party leadership is expected to meet and pass a resolution today evening to dissolve the existing set of ministers to decide to the new lot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X