వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే రాజీవ్ గాంధి పేరుతో ఓట్లను అడగండి, మోడి సవాల్

|
Google Oneindia TeluguNews

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధి పై చేసిన అవినీతి ఆరోపణలపై మరింత స్సీడ్ పెంచారు ప్రధాని నరేంద్ర మోడీ ,మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత వేడిని రగిల్చింది. ఈనేపథ్యంలోనే ఢిల్లిలో జరిగే ఎన్నికల్లో రాజీవ్ గాంధి పేరుతో ఓట్లు అడగండని ప్రధాని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

భోఫోర్స్ పై మరింత దాడిని పెంచిన ప్రధాని

భోఫోర్స్ పై మరింత దాడిని పెంచిన ప్రధాని

అయిదవ దశ లోక్ సభ ఎన్నికలుముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పై మాటల దాడిని మరింత పెంచాడు. బోఫోర్స్ కుంభకోణంతో అవినీతి మరకలతో రాజీవ్ గాంధి నిలిచిపోయారని చేసిన విమర్శలకు పలు పార్టీల నుండి ప్రధాని విమర్శలు ఎదుర్కోన్నారు. చనిపోయిన వ్యక్తిపై అవినీతి మరకలు అంటించడంపై కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో మోడీ రాజీవ్ భోఫోర్స్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్

కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్

రాజీవ్ పై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని వాటిని సమర్ధించుకుంటూ కాంగ్రెస్ నేతలకు మరో సవాల్ విసిరారు .కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తర్వాత రెండు దశల్లో జరిగే ఎన్నికల్లో రాజీవ్ గాంధి పేరుతో ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోన్నన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే బాధపడిపోతున్నారంటూ దుయ్యబట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

రాజీవ్ గాంధికి ఎవరు క్లీన్‌చీట్ ఇచ్చారు

రాజీవ్ గాంధికి ఎవరు క్లీన్‌చీట్ ఇచ్చారు

కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు వారి వారసులతోపాటు పార్టీ శ్రేణులు ,రాజీవ్ గాంధి పేరుతో ఢిల్లిలో జరగబోయో ఎన్నికల్లో ఓట్లను అడగాలి , అవినీతికి పాల్పడిన రాజీవ్ గాంధి మీద ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగుతున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈనేపథ్యంలోనే రాజీవ్ గాంధీకి భోఫోర్స్ కుంభకోణంలో ఎవరు క్లీన్‌చీట్ ఇచ్చారని ప్రశ్నించారు.

English summary
Prime Minister Narendra Modi, who has been shredded by the opposition for his remarks on Rajiv Gandhi, today amplified his argument, challenging the Congress to "fight polls in the name of the Bofors-accused former PM".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X