వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఈసీ, పోలీసుల పనితీరు భేష్ .. ఎన్డీఏ విజయంపై మోదీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీకి అపూర్వ విజయం ఇచ్చిన 130 కోట్ల భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అంతకుముందు బీజేపీ చీఫ్ అమిత్ షా శ్రేణులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!

అభినందన మందారమాల

అభినందన మందారమాల

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీజేపీకి ప్రజలు భారీ విజయం కట్టబెట్టారని గుర్తుచేశారు మోదీ. ఇప్పటివరకు జరిగినా ఏ ఎన్నికల్లో ఇంతటి భారీ మెజార్టీ అందించలేదని పేర్కొన్నారు. తమకు ఇంతటి మహాత్తర విజయం అందించిన ఓటర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు. అలాంటి ఓటు వేసేందుకు వయోజనులు మండుటెండలను కూడా లెక్కచేయలేదని చెప్పారు. ఎన్డీఏ కూటమిని మనసారా ఆశీర్వదించి అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

వజ్రాయుధం ..

వజ్రాయుధం ..

దేశ ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారని పేర్కొన్నారు. ఈ ఫకీరు జోలె నింపేందుకు వయోజనులు బారులు తీరారని తెలిపారు. ఈసారి ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యంతో భారత్ ప్రజాస్వామ్య శక్తి అని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తాయని వివరించారు. ఇక్కడ జరిగిన ఓటింగ్, ప్రజలు చూపిన చైతన్యం సర్వదా ఆదర్శనీయమని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేశారని తెలిపారు మోదీ. ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు.

ఈసీ .. భేష్ ...

ఈసీ .. భేష్ ...

దేశవ్యాప్తంగా 7 దశల్లో పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విశేషంగా కృషిచేసిందని తెలిపారు. యావత్ ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సిబ్బందితోపాటు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని గుర్తుచేశారు.

English summary
Prime Minister Narendra Modi has said that we are bowling to the 130 crore Indians who have won. After the victory of the BJP in the general election, BJP spoke emotionally in the central office of the BJP. Earlier, BJP chief Amit Shah thanked staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X