వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్ వ్యూహంతో గెలుపు, కొత్తకాదని సుప్రియా: మహా గెలుపు.. ఇదీ లెక్క

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. 2017లో బీజేపీకి ఇది అద్భుత ప్రారంభం అన్నారు. మొదట ఒడిశా, తర్వాత మహారాష్ట్రల ప్రజలు పట్టం కట్టారన్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. 2017లో బీజేపీకి ఇది అద్భుత ప్రారంభం అన్నారు. మొదట ఒడిశా, తర్వాత మహారాష్ట్రల ప్రజలు పట్టం కట్టారన్నారు.

<strong>అంతా గెలిచినా.. అక్కడ బీజేపీకి షాక్: పంకజ రాజీనామా, నో చెప్పిన చీఫ్</strong>అంతా గెలిచినా.. అక్కడ బీజేపీకి షాక్: పంకజ రాజీనామా, నో చెప్పిన చీఫ్

కిందిస్థాయి నుంచి కష్టపడి పని చేయడం ద్వారా మహారాష్ట్రలో నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీ బలంగా ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలకు మోడీ శుభాకాంక్షలు చెప్పారు. మహారాష్ట్ర బీజేపీకి, సీఎంకు, పార్టీ చీఫ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

ఇదిలా ఉండగా, 227 స్థానాల్లో ఇటు బీజేపీకు, అటు శివసేనకు మేజిక్ ఫిగర్ 114 రాలేదు. బీజేపీకి 82, శివసేనకు 84 స్థానాలు వచ్చాయి. తమకు స్వతంత్రుల మద్దతు ఉందని బీజేపీ చెప్పినప్పటికీ.. అది కుదిరేలా లేదు. విభేదాలున్నప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఉంది.

ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్

కాబట్టి బీఎంసీ ఎన్నికల్లోను ఈ రెండు పార్టీలు కలిసిపోవచ్చునని అంటున్నారు. అప్పుడు శివసేనకు మేయర్ పదవి దక్కవచ్చునని అంటున్నారు. కాగా, ఇప్పుడు మేయర్ పదవి, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పదవి శివసేన నుంచేనని ఉద్దవ్ అంటున్నారు.

ఇదీ లెక్క

మహారాష్ట్రలో మొత్తంగా బీజేపీ పదింట 8, శివసేన 2 మున్సిపల్ కార్పోరేషన్లు సొంతం చేసుకుంది. బీఎంసీలో శివసేనకు 84, బీజేపీకి 81 వచ్చాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి దెబ్బ తగిలింది.

ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!

2012 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రం మొత్తంలో శివసేనతో పొత్తుతో 205 స్థానాలు గెలవగా, ఈసారి ఒంటరిగా 621 స్థానాలు గెలిచింది. శివసేన నాడు 227, నేడు 267 స్థానాలను గెలుచుకుంది.

2012లో కాంగ్రెస్ 264 గెలవగా ఇప్పుడు 120 స్థానాలకు పడిపోయింది. ఎన్సీపీ నాడు 265 స్థానాలు గెలవగా, ఇప్పుడు 136 గెలిచింది. ఎంఎన్ఎస్ నాడు 112 గెలిచి, నేడు 15 మాత్రమే గెలిచింది.

బీజేపీ దూకుడు.. మోడీ గెలుపు

బీజేపీ దూకుడు.. మోడీ గెలుపు

ముంబై పాలక ఎన్నికలతో పాటు, మహారాష్ట్రలోనని ఇతర స్థానిక ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 10 నగరపాలక సంస్థల్లో ముంబై, థానే మినహా మిగిలిన అన్నీ చోట్ల బీజేపీ విజయం సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయం ప్రధాని మోడీదేనని పేర్కొన్నారు.

అవినీతిరహిత పాలన

అవినీతిరహిత పాలన

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పాలనలో అవినీతి లేకుండా చేయడంతో మహారాష్ట్ర ప్రజానీకం ఆయన వైపు ఆకర్షితులయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో సీనియర్‌ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సేను తొలగించడంతో పాలనపై సానుకూలత వ్యక్తమయింది. అవినీతి అంశంలో నరసింహుడిని ఆదర్శంగా తీసుకుంటానని అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించబోనని చెప్పారు.

శివసేనకు పట్టు.. ఫడ్నవీస్ వ్యూహం

శివసేనకు పట్టు.. ఫడ్నవీస్ వ్యూహం

ముంబైలో శివసేనకు పట్టువుంది. గతంలోనూ బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకొని పోటీచేసేవి. అయితే, ఈ పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని శివసేన హెచ్చరికలు జారీ చేసింది. 2012 ముంబై పాలక ఎన్నికల్లో బీజేపీ కేవలం 31 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ఫడ్నవీస్ వ్యూహాలను రచించాడు. ప్రతిరోజు ఏకంగా అయిదు ర్యాలీల్లో పాల్గొన్నారు.

బలమైన నేతగా ఫడ్నవీస్

బలమైన నేతగా ఫడ్నవీస్

తాజా ఎన్నికల విజయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ బలమైన నేతగా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నారు. ఆయనకు అన్ని వర్గాలు మద్దతు పలుకుతున్నాయని తాజా ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అంటున్నారు.

లాటరీలో బీజేపీని వరించిన అదృష్టం

లాటరీలో బీజేపీని వరించిన అదృష్టం

ముంబైలో మొత్తం 81 స్థానాలను గెలుచుకోవడంతో తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. మరో వార్డులో శివసేనకు బీజేపీకి ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో అక్కడ లాటరీ తీశారు. బీజేపీని అదృష్టం వరించింది. దీంతో బీజేపీ స్థానాలు 82 అయ్యాయి.

ఎన్సీపీ కోటలో పాగా

ఎన్సీపీ కోటలో పాగా


శరద్ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ చేతిలో పుణె నగరపాలక సంఘం ఉండేది. తాజా ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి పుణెలో విజయం సాధించింది. దీంతో ఎన్సీపీ ఖంగు తిన్నది. మరో వైపు శివసేన నుంచి చీలిపోయి వేరుకుంపటి పెట్టుకున్న రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. మహారాష్ట్ర పట్టణప్రాంతాలపై గట్టిపట్టున్న పార్టీగా పేరున్నప్పటికీ తాజా ఎన్నికల్లో గణనీయమైన విజయాలను నమోదు చేయడంలో విఫలమైంది.

కాంగ్రెస్‌కు షాక్

కాంగ్రెస్‌కు షాక్

శివసేన-బీజేపీ కూటమి వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ అలా జరగలేదు.

సుప్రియా సూలే షాక్

సుప్రియా సూలే షాక్

ముంబై నగరపాలక సంఘం, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ముంబైలో ఎన్సీపీకి కేవలం 9 స్థానాలే వచ్చాయి. ఈ ఫలితాల నేపథ్యంలో తమ పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలే ఎప్పుడూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో లాభం పొందుతాయన్నారు. తాము కూడా 2012లో గెలుపొందామని, అదేమీ కొత్త విషయం కాదన్నారు.

కోటీశ్వరుడు పరాగ్ షా గెలుపు

కోటీశ్వరుడు పరాగ్ షా గెలుపు

ముంబై లోకల్ ఎన్నికల్లో రూ.690 కోట్ల ఆస్తులను ఆఫిడవిట్‌లో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి పరాగ్ షా విజయం సాధించాడు. ఘట్కోపర్‌ డివిజన్‌ నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రవీణ్ చెదాపై గెలుపొందారు. రియల్ ఎస్టేట్‌, గృహ నిర్మాణరంగంలో తన పెట్టుబడులు ఉన్నట్టు షా నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఘట్కోపర్‌లో ఎక్కువమంది గుజరాతీలు, దక్షిణ భారతీయ ఓటర్లు ఉన్నారు. షాతో పాటు చెదా కూడా గుజరాతీయులు కావడంతో ఎవరు విజయం సాధిస్తారో అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్ మెహతా మద్దతు ఉండటంతో పాటు దక్షిణ భారతీయుల ఓట్లను ఆకర్షించడంతో షా విజయం సాధించారని అంటున్నారు.

English summary
The Congress faced yet another humiliating defeat in the civic elections in Maharashtra. The Congress put up a dismal performance in all five local bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X