వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఇందులో తమ నేతను పార్టీలు ఎన్నుకున్నాయి.

నేతగా ఎంపిక
నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని శిరోమణి అకాళీదల్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, జేడీయూ నేత నితీశ్ కుమార్ బలపరిచారు. ఆ తర్వాత భాగస్వామ్య పక్షాల నేతలు మోడీ వద్దకొచ్చి అభినందనలు తెలిపారు. తన గురువు అద్వానీ వద్దకొచ్చి పాదాభివందన చేశారు మోడీ. తర్వాత సీనియర్ నేత మురళి మనోహర్ జోషిని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, బీజేపీ నేతలు హాజరయ్యారు.

modi elect nda leader, he bow the constitution

రాజ్యాంగానికి ప్రాణామం
ఎన్డీఏ సమావేశానికి వెళ్లేందుకు భారత రాజ్యాంగానికి నమస్కరించారు మోడీ. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి .. ప్రధాని పీఠం అధిష్టించిన మోదీ, పార్లమెంట్‌లోకి ప్రవేశించే సమయంలో ద్వారాన్ని నమస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారీ విజయం సాధించండంతో .. భారత రాజ్యాంగాన్ని వినమ్రంగా నమస్కరించారు మోడీ. అలాగే మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న నేతలను అభినందిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ. క్యాబినెట్ బెర్తులపై మీడియా తప్పుదారి పట్టిస్తోందని వ్యాఖ్యానించారు మోడీ. ఎవరూ, ఎలాంటి ఊహాగానాలను నమ్మొద్దని .. సామాజిక సమీకరణాలు, ప్రతిభ ఆధారంగా బెర్త్ దక్కుతుందనే సందేశం ఇచ్చారు మోదీ.

English summary
NDA elects Narendra Modi as its leader. I thank all the allies and the MPs who have unanimously chosen NDA's leader Narendra Modi as the new Prime Minister of the country says amith shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X