• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శబరిమలపై మొదటిసారి స్పందించిన మోడీ... కాంగ్రెస్ - లెఫ్ట్‌కు తేడా లేదని ధ్వజం

|

ఢిల్లీ : శబరిమల అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన తరుణంలో మొదటిసారిగా మాట్లాడిన మోడీ కేరళ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శబరిమల ఆలయం విషయంలో కేరళ సర్కార్ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. చరిత్రలోనే అత్యంత హేయనీయమైన చర్యగా అభివర్ణించారు.

ఆ రెండింటికీ పెద్ద తేడా లేదు

ఆ రెండింటికీ పెద్ద తేడా లేదు

కాంగ్రెస్, వామపక్ష పార్టీల పాలనపై మోడీ ఫైరయ్యారు. ఆ రెండింటికీ పెద్ద తేడా లేదన్నారు. కులం, మతం, అవినీతి అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వానికి.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు వైపులని ఎద్దేవా చేశారు. శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం తీరు అత్యంత హేయనీయమైన చర్యగా చరిత్రలో నిలిచిపోతుందని ధ్వజమెత్తారు. ఇంతకుముందు ఏ పార్టీ గానీ ప్రభుత్వం గానీ ఇలా ప్రవర్తించలేదన్నారు. కమ్యూనిస్టులు ఆధ్యాత్మికపరమైన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించరనే విషయం అందరికి తెలుసని.. కానీ ఇంత హీనంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు ఊహించలేదన్నారు.

 రెండు నాల్కల ధోరణి

రెండు నాల్కల ధోరణి

శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడం సరికాదన్నారు మోడీ. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా మాట్లాడుతూ.. కేరళలో మరోలా మాట్లాడుతున్న పద్దతి మంచిదికాదని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు అండగా ఉండాలన్నా.. వారి సంప్రదాయాలకు రక్షణగా నిలవాలన్నా అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను తక్కువగా చూడొద్దని

యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ పార్టీలకు అల్టిమేటం ఇచ్చారు.

చౌకీదార్ అడ్డు తొలగించాలనే కుట్ర

చౌకీదార్ అడ్డు తొలగించాలనే కుట్ర

కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కొల్లాం లోని నేషనల్ హైవే 66 పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్ లో 1550 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కుంభకోణాలు బయటపెడుతున్నందుకు తనను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో దొంగ పత్రాలు సృష్టించి పింఛన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు ఇలా అక్రమంగా 90వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని.. ఆ కుంభకోణం అడ్డుకుంటే అక్రమార్కులంతా ఒక్కటయ్యారని ఆరోపించారు. అందుకే ఈ చౌకీదార్ అడ్డు తొలగించుకోవాలనే కుట్ర జరుగుతుందన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Modi fires on the Congress and the Left parties. That's no big difference. The Left Democratic Alliance (LDF) in Kerala in the caste, religion and corruption issues led the Congress-led UDF to both sides of the same coin. He said that, The Government of Kerala on the Sabarimala issue has been blamed for the most abusive act in history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more