వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటపై నుంచి మోడీ ఎన్నికల ప్రచారం చేశారు: మాయావతి

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోడీ ఎర్రకోటపై స్వాతంత్రదినోత్సవంగా సందర్భంగా చేసిన ప్రసంగం ఎన్నికల ప్రసంగాన్ని తలపిస్తోందని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అభినేత్రి మాయావతి అన్నారు. ప్రధాని దేశప్రజల్లో నూతన ఉత్తేజాన్ని, ఆశను నిపండంలో విఫలమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజలకు జీవితంపై భరోసా ఇవ్వడంలో ప్రధాని ఫెయిల్ అయ్యారని బెహన్‌జీ ఆరోపించారు.

స్వాతంత్ర దినోత్సవం రోజున మోడీ చేసిన ప్రసంగం ఎన్నికల ప్రచార సమయంలో తనదైన శైలిలో చేసే స్పీచ్‌లా ఉన్నిందని మాయావతి ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు స్వాంతంత్ర దినోత్సవంను మోడీ వినియోగించుకున్నారని మాయావతి మండిపడ్డారు. ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన పథకాలవల్ల ఎలాంటి లబ్ధ చేకూరుతుందో పార్లమెంటులో చెప్పాలని... ఎర్రకోటపై ఇచ్చే ప్రసంగం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించేలా ఉండాలని మాయావతి సూచించారు. ఇది బీజేపీకి ఎక్కదని... రానున్న ఎన్నికలు మాత్రమే కమలనాథుల దృష్టిలో ఉన్నాయని మాయావతి అన్నారు.

Modi gave an election speech from Redfort,says Mayawati

స్వాంతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదన్న బెహన్‌జీ... ఆయన ఎక్కడికి వెళ్లినా ఇదే తరహా ప్రసంగాలు చేస్తారని చెప్పింది. అది ఎన్నికల ప్రచారమైనా.. సాధారణ ర్యాలీ అయినా విదేశాల పర్యటనలైనా మోడీ ఇలాంటి రాజకీయ ప్రసంగాలే చేస్తారని మాయావతి మండిపడ్డారు. దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ నోరెందుకు మెదపరని ఆమె ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని చెప్పిన మాయావతి... పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. రూపాయి పతనంతో చాలా మంది విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇబ్బందిపడుతున్నారని మాయావతి అన్నారు.

English summary
BSP president Mayawati on Wednesday dubbed Prime Minister Narendra Modi's Independence Day address from the ramparts of the Red Fort as an "election speech in his political style".Mayawati said that the speech "failed to infuse" new energy or hope and the Prime Minister "failed to assure the safety of life" and property of people which is of utmost importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X