• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైల్వేలో రూ.లక్ష కోట్లు ప్రైవేటు చేతికి -ఆస్తుల అమ్మకంలో మోదీ సర్కార్ జోరు -శాఖలవారీగా టార్గెట్లు ఇవే

|

వ్యూహాత్మక రంగాలుగా భావించే నాలుగు సంస్థలు తప్ప.. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఇదివరకే స్పష్టం చేసింది. వ్యాపార నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత కాదన్న ప్రధాని ఉపదేశానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఆయా సంస్థల ఆస్తుల అమ్మకాలు, స్థిరాస్థులను నగదు రూపంలోకి మార్చుకునే(మానిటైజేషన్) ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. ఈ మేరకు ఆయా శాఖలకు టార్గెట్లు కూడా విధించారు. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ద్వారా అమ్మకాల ప్రక్రియ జోరందుకుందిలా..

ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్

సగం ఆదాయం రైల్వే, టెలికాం నుంచే

సగం ఆదాయం రైల్వే, టెలికాం నుంచే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం లేదా ప్రైవేటీకరణ ద్వారా మొత్తం రూ.2.5లక్షల కోట్ల నిధులను పోగేయాలనుకుంటోన్న కేంద్రం.. అందులో సగం నిధుల్ని కేవలం రైల్వే, టెలికాం శాఖల నుంచే పొందనుంది. అదే సమయంలో ఆహార ధాన్యాలు, బొగ్గు, ఇతర గనులు, పర్యాటక మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు సహా అమ్మకానికి లేదా ప్రైవేటుకు ఇవ్వగలిగే అన్ని అవకాశాలను క్షణ్నంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఆస్తుల మానిటైజేషన్ కు సంబంధించి ఆయా శాఖలకు టార్గెట్లు కూడా విధించింది.

ఒక్క రైల్వేలోనే దాదాపు లక్ష కోట్లు

ఒక్క రైల్వేలోనే దాదాపు లక్ష కోట్లు

ప్రైవేటీకరణపై కేంద్రం తన విధానాన్ని ముందుకు తోయడంతో.. దానిని అమలు చేసే బాధ్యతను నీతి ఆయోగ్ తలకెత్తుకుంది. ఆయా మంత్రిత్వ శాఖల ఆస్తుల జాబితాతో లిస్టును రూపొందించి, ప్రైవేటీకరణకు రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధం చేయాలని నీతి ఆయోగ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ టార్గెట్లను కూడా సిద్ధం చేశారు.

ఓ డ్యాష్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆయా శాఖలకు విధించిన టార్గెట్లలో రైల్వే శాఖ టాప్ లో ఉంది. ఒక్క రైల్వేస్ లోనే రూ.90వేల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ధారించారు. భారీ ఎత్తున ప్రైవేటు రైళ్ల రంగప్రవేశం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వేగంగా నడిచే గూడ్స్ రైళ్లను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇక..

షాక్: ఆ టీకాతో రక్తం గడ్డకడుతోంది -ఎనిమిది దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నిలిపివేత, కలకలంషాక్: ఆ టీకాతో రక్తం గడ్డకడుతోంది -ఎనిమిది దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నిలిపివేత, కలకలం

శాఖల వారీగా టార్గెట్లు ఇవే..

శాఖల వారీగా టార్గెట్లు ఇవే..

స్తిరాస్తిని నగదు రూపంలోకి మార్చుకునే మానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా రైల్వే శాఖకు రూ.90వేల కోట్ల టార్గెట్ విధించగా, రెండో ప్రాధాన్యతగా టెలికాం రంగం ఉంది. టెలికాం శాఖకు రూ.40వేల కోట్ల టార్గెట్ నిర్ధారించారు. దేశమంతటా విస్తరించి ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ టవర్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఈ నిధులు సమకూరనున్నాయి. ఇక రోడ్లు, హైవేల శాఖకు రూ.30 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.27వేల కోట్లు, విమానయానంలో రూ.20వేల కోట్లు, క్రీడా శాఖలో రూ.20 వేల కోట్లు, పెట్రోలియం 17వేల కోట్లు, పోర్టులు షిప్పింగ్ శాఖకు రూ.4వేల కోట్ల టార్గెట్ విధించారు.

కాంగ్రెస్ అజెండాను ముందుకు..

కాంగ్రెస్ అజెండాను ముందుకు..

ప్రస్తుత కేంద్ర సర్కార్ అమలు చేస్తోన్న ప్రైవేటీకరణ విధానంలో ఆయా సంస్థల వాటాదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కార్యదర్శి టీకే పాండే తెలిపారు. నిజానికి ఇప్పుడు అమలవుతున్నది.. 1991 నాటి(కాంగ్రెస్) సరళీకరణ విధానాలకు కొనసాగింపే అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థల్లో వాటాల అమ్మకం వ్యూహాత్మకంగా సాగుతుందని, ధరలపై ప్రతికూల ప్రభావాలు పడే ఉపసంహరణల జోలికి వెళ్లబోమని పాండే అన్నారు.

English summary
The government is targeting half its asset monetisation target of Rs 2.5 lakh crore from railways and telecom. After deliberations with ministries and departments it has fixed a Rs 90,000 crore target for the railways and Rs 40,000 crore target for telecom. Niti Aayog is setting up a dashboard for tracking the progress. The strategy has been worked out by a committee of secretaries, headed by cabinet secretary Rajiv Gauba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X