వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ధిక సంవత్సరం ఆదిలోనే హంసపాదు .. కరోనాదెబ్బతో భారీ అప్పు చేస్తున్న మోడీ సర్కార్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదేలు చేస్తుంది . ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితులను తెచ్చి పెడుతుంది. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు అన్ని దేశాలను ఇబ్బంది పెడుతుంది మహమ్మారి కరోనా దాడితో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఉత్పత్తి లేదు సప్లై లేదు.. వర్తక వాణిజ్యాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో భారత ప్రభుత్వం వైరస్ బాగా వ్యాప్తి చెందితే కంట్రోల్ చెయ్యటం కష్టం అని భావించి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... మీటర్ రీడింగ్ చూడకుండానే కరెంట్ బిల్ .. ఎలాగంటేలాక్ డౌన్ ఎఫెక్ట్ ... మీటర్ రీడింగ్ చూడకుండానే కరెంట్ బిల్ .. ఎలాగంటే

కరోనా , లాక్ డౌన్ ప్రభావంతో తడిసి మోపెడు అవుతున్న ఖర్చు

కరోనా , లాక్ డౌన్ ప్రభావంతో తడిసి మోపెడు అవుతున్న ఖర్చు

లాక్ డౌన్ విధించి ప్రజల ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది భారత సర్కార్ . ఇక దీంతో ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోయి భారతదేశం కూడా ఆర్ధిక నష్టాల్లో, కష్టాల్లో పడిపోయింది. కరోనా ప్రభావంతో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. దీంతో ఆర్ధిక సంవత్సరం ఆరంభంలోనే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా అప్పుతో ఆర్ధిక సంవత్సరం ఆరంభం అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది.

 కరోనా కంట్రోల్ కోసం ఆపు చేస్తున్న మోడీ సర్కార్

కరోనా కంట్రోల్ కోసం ఆపు చేస్తున్న మోడీ సర్కార్

కరోనా వైరస్ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు అప్పు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ఈ అప్పు అని చెప్తుంది . ఇక ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి మాట్లాడారు. కరోనా వైరస్ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో కేంద్రం చాలా అప్రమత్తంగా ఉందని, కరోనా నియంత్రణ కోసమే ఈ అప్పు అని చక్రవర్తి తెలిపారు.

కరోనా ఎఫెక్ట్ .. ప్రధమార్ధంలోనే ఊహించని అప్పు

కరోనా ఎఫెక్ట్ .. ప్రధమార్ధంలోనే ఊహించని అప్పు

ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది. పాత రుణాల చెల్లింపుల గురించి స్థూల రుణాల్లో సైతం ఉంటాయి. ఇక నికర రుణాలు 202-21కి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె అంచనా వేశారు. ఇక 2019-2020లో ఇది రూ.4.99 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఊహించని విధంగా కరోనా ఎఫెక్ట్ తో ఏ మేరకు అప్పుల పాలవుతామో తెలియని పరిస్థితి ప్రస్తుత కనిపిస్తుంది. ఒక్క ఇండియా మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది .

English summary
Under the current conditions of corona effect, the cost to governments is rising. With the start of the financial year, has been a debt of Rs 4.88 lakh crore. Against this backdrop, the central government has decided to borrow Rs 4.88 lakh crore in the first half of the fiscal year 2020-21, which begins on April 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X