వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10శాతం ఏరియర్స్: సైన్యానికి మోడీ దీపావళి కానుక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నెలకొన్న కొత్త పే గ్రేడ్ వివాదాన్ని సద్దు మణిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా భారత సైనికులకు ప్రత్యేక కానుకలు అందించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 10న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అధ్యక్షన జరిగిన సమావేశంలో పే కమి కమిషన్ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నందున తాత్కాలికంగా ఏరియర్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

దీంతో సైనికులందరికీ జనవరి 2016 నుంచి 10శాతం ఏరియర్స్(కరువు భత్యం కూడా) కలుపుకుని చెల్లించనున్నారు. అంటే, ప్రతీ సైనికుడు ఒక నెల జీతం బోనసగా పొందనున్నాడన్నమాట. అక్టోబర్ 30 దీపావళి పర్వదినం పురస్కరించుకుని అంతకంటే ముందే ఈ మొత్తం చెల్లించనున్నారు. సివిల్స్ సర్వీసెస్‌లా సాయుధ బలగాలు ఇప్పటి వరకు ఏరియర్స్ పొందలేదు, జీతాల పెంపుదల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు.

Modi government's Diwali gift! Indian soldiers likely to get 10% arrears before October 30

కమిషన్ కంపెన్షేషన్ నిర్మాణంలో కొన్ని సరిచేయాలని మూడు సర్వీసుల చీఫ్‌లు జోక్యం చేసుకోవడం ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది. డిసబిలిటీ పే, పెన్షన్లు, పే కమిషన్ సూచనలు అమలు చేయడం లేదని వారు చెబుతున్నారు. పండగ సీజన్లో అదనపు మొత్తం అక్టోబర్ 8 వరకు రాకపోవడంపై సాయుధ బలగాలు, రిటైర్డు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీపావళి పండగలోగా ఏరియర్స్ అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సాయుధ బలగాల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక, ఎక్కువగా దాడులకు గురయ్యే బలగాలకు సముచితమైన జీతం, నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
The government has a Diwali gift for India's soldiers — an interim payment even as the government and defence chiefs try to sort out a dispute over new pay grades for armed forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X