• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యువతకు టీకా ఇవ్వాలని కోరా..ప్రణాళిక లేదు-పద్ధతి లేదు: మోడీ సర్కార్‌పై కిరణ్ మజుందార్ ఫైర్

|

కోవిడ్ రూపంలో భారత్ అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోందని అన్నారు బైయోకాన్ వ్యవస్థాపకులు ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరన్ మజుందార్ షా. ప్రస్తుతం సెకండ్ వేవ్‌ను జయించాలంటే అత్యవసన ఔషధాలను ఎట్టిపరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవడం ఒక్కటే మార్గమని ఆమె పేర్కొన్నారు. యువతకు వెంటనే టీకా ఇవ్వాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని... ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయిందని అన్నారు. తన మాట ఎవరూ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో ప్రస్తుత కోవిడ్ మహమ్మారిపై పలు ఆసక్తికర విషయాలను రెడిఫ్‌ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌తో పంచుకున్నారు.

  COVID : Lancet Criticized ఆగష్టు నాటికి 10 లక్షల మరణాలు Modi ప్రభుత్వమే బాధ్యత || Oneindia Telugu
   ప్రణాళిక, జవాబుదారీతనం లేదు

  ప్రణాళిక, జవాబుదారీతనం లేదు


  భారత్‌లో సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు వ్యూహం కానీ, ప్రణాళిక కానీ సిద్ధం చేయలేదని కిరణ్ మజుందార్ షా మండిపడ్డారు. జవాబుదారీతనం లేదని చెప్పిన బయోకాన్ వ్యవస్థాపకులు.. అత్యవసర మందులు నిల్వ ఉంచుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందో తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మహమ్మారి నుంచి భారత్ కోలుకుందనే భ్రమలో ప్రభుత్వం ఉన్నిందని... మెల్లగా టీకా కార్యక్రమం ప్రారంభించి దాన్ని కొనసాగించొచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నిందని ఆమె మండిపడ్డారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైందని చెప్పారు. వస్తున్న ప్రమాదంపై ఏదేశ ప్రభుత్వమైనా సరే ప్రైవేట్ రంగంతో చర్చించాలని ఆమె సూచించారు.

  ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుంచి సహకారం లేదు

  ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుంచి సహకారం లేదు


  ఒక వేళ తనే ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటే... సీరం ఇన్స్‌టిట్యూట్‌కు భారత్ బయోటెక్ సంస్థలకు వ్యాక్సిన్ తయారీని కొనసాగించమని , అనుమతులు వచ్చే వరకు వేచిచూడొద్దని చెప్పేదాన్ని అని కిరణ్ చెప్పారు. ప్రైవేట్ సంస్థలకు వ్యాక్సిన్ తయారు చేయమని చెప్పి వారికి కావాల్సిన ఆర్థిక సహకారం ప్రభుత్వం అందించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. కనీసం ఒక డోసుకు రూ.100 ఇచ్చి ఉన్నా... ఈ రోజు 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉండేదని అన్నారు. రిస్క్ మొత్తం ప్రైవేట్ రంగమే భరించాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ఆరోగ్య రంగంలో ప్రైవేట్ భాగస్వాములు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ ఐసీయూ, ఎక్కువ డాక్టర్లు, నర్సులు ఉంటే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

   ప్రభుత్వానిది పసలేని వ్యాఖ్యలు

  ప్రభుత్వానిది పసలేని వ్యాఖ్యలు

  ఇక రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కష్టాలపై కూడా కిరణ్ మజుందార్ షా అభిప్రాయం తెలిపారు. ఈ మే నెల చివరి నాటికి రెమ్‌డెసివిర్ కష్టాలు కొలిక్కి వస్తాయని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర ఔషధాలకు డిమాండ్ ఉన్నప్పుడు కంపెనీలు తయారు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇవి 24 గంటల్లో తయారు చేయలేమని చెప్పారు. యాంటిబాడీస్ డెవలప్ చేసే మందుల తయారీకి కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. ఇక జూన్ మూడవ వారం నాటికి డిమాండ్‌కు తగ్గ సప్లయ్ ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న పేషెంట్లకు మాత్రమే ఇవ్వాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

  లక్షణాలు గమనించిన వెంటనే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి

  లక్షణాలు గమనించిన వెంటనే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి

  రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోవిడ్ లక్షణాలు ఉండి హాస్పిటల్‌లో చేరేందుకు వచ్చిన వారికి ఎర్లీ స్టేజ్‌లో ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఒక్కో మెడిసిన్ ఒక్కో వ్యాధికి పనిచేస్తుందన్న విషయం గ్రహించాలని సూచించారు. వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తులకు రెమ్‌డెసివిర్ ఇస్తే అది పనిచేయదని... లక్షణాలు గమనించిన వెంటనే ఇవ్వాలని ఆమె అన్నారు. అప్పుడిస్తేనే అది పనిచేసి వైరస్‌ను కట్టడి చేస్తుందని చెప్పారు. ఒక వ్యక్తికి జ్వరం తీవ్రంగా ఉండి ఇంట్లోనే ఉంటూ రెమ్‌డెసివిర్ తీసుకుంటే కోలుకునే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని అన్నారు.

  బయోకాన్ తయారు చేసిన ఐటూలిజుమాబ్

  బయోకాన్ తయారు చేసిన ఐటూలిజుమాబ్


  ఇక తమ కంపెనీ బయోకాన్ తయారు చేసిన ఐటూలిజుమాబ్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తోందని కిరణ్ మజుందార్ షా తెలిపారు. టోసిలిజుమాబ్ కొరత వచ్చిన సమయంలో తమ కంపెనీ తయారు చేసిన ఐటూలిజుమాబ్ మెడిసిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడిన డాక్టర్లు ఇది మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పినట్లు కిరణ్ మజుందార్ షా గుర్తుచేశారు. ఇది సరికొత్త ఔషధం అని సోరియాసిస్ వ్యాధి కోసం దాన్ని డెవలప్ చేశామని వెల్లడించారు. అయితే ఇది ఇతర వ్యాధులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఐటూలిజుమాబ్ మెడిసిన్ ఆస్తమా, లూపస్‌లకు వాడుతున్నారని చెప్పారు. పరిశోధనలు చేసేందుకు తనదగ్గరున్న డబ్బును భారత్‌లో వెచ్చించాల్సి వచ్చిందని తనకు ఎవరూ సహాయం చేయలేదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు లభించలేదని వాపోయిన కిరణ్ మజుందార్ షా... అత్యవసర వినియోగం కింద డీసీజీఐ అనుమతి ఇచ్చిందని అయితే నేషనల్ క్లినికల్ ప్రొటోకాల్‌లో మాత్రం చేర్చలేదని చెప్పారు. గతంలో పెద్ద సంఖ్యలో ఐటూలిజుమాబ్ పలు హాస్పిటల్స్‌కు విక్రయించినట్లు చెప్పిన కిరణ్... ఇప్పుడు చాలా హాస్పిటల్స్ దానికోసం పడిగాపులు కాస్తున్నాయని వివరించారు.

  English summary
  Modi Govt failed to handle Covid second wave situation said Biocon founder and executive chairperson Kiran Mazumdar-Shaw.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X