వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని మీడియాపై చూపిస్తోన్న రాహుల్ గాంధీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నాహాలు చేస్తోన్న నేపథ్యంలో.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తమ పార్టీ నాయకుడు చిదంబరానికి మద్దతు ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే.. ఏఐసీసీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెర మీదికి వచ్చారు. చిదంబరాన్ని అరెస్టు చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకింత ఆరాట పడుతోందని అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. చిదంబరం అరెస్టు విషయంలో రాహుల్ గాంధీ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. వెన్నెముక లేనట్టుగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లతో పాటు కొన్ని మీడియా సంస్థలు వెన్నెముక లేనట్టుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు, ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా దేశానికి సేవలు చేసిన చిదంబరంపై వ్యక్తిత్వ దాడికి దిగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని అన్నారు. చిదంబరం అరెస్టు వ్యవహారంలో అంతకుముందే- ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించిన విషయం తెలిసిందే.

Modi govt using ED, CBI to character assassinate Chidambaram, says Rahul Gandhi

అరెస్టు తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో పీ చిదంబరం అదృశ్యం అయ్యారు. ఆయన కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ లుక్ అవుట్ నోటీసులను జారీ చేసింది. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. చిదంబరం నివాసానికి నోటీసులను అంటించారు. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు అక్రమంగా విదేశీ నిధులను సమకూర్చారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న చిదంబరానికి అరెస్టు కంటే ముందే బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ, ఈడీ ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్టు జరగొచ్చని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Congress MP from Wayanad Rahul Gandhi on Wednesday expressed his dismay with the proceedings against senior party leader P Chidambaram in the INX Media case. Taking to Twitter, Rahul tweeted, “Modi’s Govt is using the ED, CBI & sections of a spineless media to character assassinate Mr Chidambaram. I strongly condemn this disgraceful misuse of power.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X