వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్‌జీ బ్యాన్‌పై మోడీ యూటర్న్ అందుకే: ఫాంటసీ వరల్డ్‌లో యూత్: ఉద్యోగాలు అడుగుతారనే భయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన టాప్ ఆన్‌లైన్ గేమింగ్ పబ్‌జీని కేంద్ర ప్రభుత్వం నిషేధించకపోవడం పట్ల కాంగ్రెస్ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. పబ్‌జీ గేమ్‌ను నిషేధిస్తామని తొలుత ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనంతరం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నిలదీశారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని ఆయన చెప్పారు. పబ్‌జీని నిషేధించితే.. ఫాంటసీ ప్రపంచం నుంచి యువత బయటికి వస్తారని, ఉద్యోగాలు అడుగుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించి ఉండొచ్చని అన్నారు.

యువతను పబ్‌జీ అనే ఫాంటసీ ప్రపంచంలో ఉంచడానికే కేంద్ర ప్రభుత్వం దాన్ని నిషేధించలేదని విమర్శించారు. దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జీ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలో చైనాకు చెందిన కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దీనితో ఆ గేమ్‌ను నిషేధించాలని తొలుత కేంద్ర ప్రభుత్వం భావించిందని, అనంతరం దాన్ని వెనక్కి తీసుకుందని మను సంఘ్వి అన్నారు. తాజాగా నిషేధించిన యాప్స్‌‌ల జాబితా నుంచి పబ్‌జీని తొలగించడానికి గల కారణాలను కేంద్రప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. పబ్‌జీ బ్యాన్‌ చేస్తే యువత ఖాళీగా ఉండి..ఉద్యోగాల కోసం డిమాండ్‌ చేస్తారనే భయం కేంద్ర ప్రభుత్వంలో నెలకొందని అన్నారు.

Modi govt wanted to ban PUBG, but realised youth will then ask for jobs: Abhishek Singhvi

ఫాంటసీ ప్రపంచం నుంచి యువత వాస్తవ ప్రపంచానికి వస్తారని, ఉద్యోగాలు కావాలంటూ డిమాండ్ చేస్తారని సింఘ్వీ అన్నారు. అందుకే యువతను ఫాంటసీ ప్రపంచంలోనే ఉంచేలా నరేంద్ర మోడీ చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. కోట్లాదిమంది యువత ఒక్కసారిగా పబ్‌జీని ఆడేయటం మానేసి వాస్తవ ప్రపంచంలోకి వస్తే.. వారి శక్తిని కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. వారంతా ఒక్కాసారిగా ఉద్యోగాలు కావాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభిస్తే.. దాని ఎదుర్కొనడం కేంద్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా పరిణమిస్తుందని సింఘ్వీ కామెంట్స్ చేశారు.

Recommended Video

47 China Apps పై భారత్ నిషేధం.. త్వరలో మరో 275 Apps.. లిస్ట్ లో PUBG

ఇదివరకు కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఇందులో టిక్‌టాక్ కూడా ఉంది. రెండో దశలో మరికొన్ని యాప్స్‌ను గుర్తించింది. నిషేధిత జాబితాలో చేర్చింది. తొలుత పబ్‌జీని కూడా ఈ జాబితాలోకి చేర్చినప్పటికీ.. అనంతరం దాన్ని తొలగించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వినియోగించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలను అందుకుంది. పబ్‌జీని నిషేధించాలంటూ అభిషేక్ మను సింఘ్వీ ఎక్కడా నేరుగా డిమాండ్ చేయనప్పటికీ.. నిషేధిత జాబితా నుంచి దాన్ని తొలగించడాన్ని తప్పు పట్టారు.

English summary
A day after the government banned another batch of 47 Chinese apps, Congress spokesperson Abhishek Manu Singhvi said that the Modi government wanted to ban PUBG, a popular online video game, but realised that if the youth stops playing the game, they will talk about unemployment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X