వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిర ఎమర్జెన్సీతో దేశం నష్టపోయింది: ప్రధాని మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరా గాంధఈ దేశంలో విధించిన అత్యయిక స్థితితో భారత దేశం భారీగా నష్టపోయిందని ప్రదాని నరేంద్ర మోడీ ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ 113వ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన లోక్ తంత్ర్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాటి ఎమర్జెన్సీ రోజులను మననం చేసుకున్నారు. దేశం గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారన్నారు. దీంతో, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జెపి నారాయణకు మీడియా ఎంతోగానే సహకరించిందన్నారు.

Modi hails JP, says Emergency damaged India's democratic tradition

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జెపితో కలిసి పోరాడిన 14 మందిని సన్మానించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం నినాదంతో జేపీకి ప్రజలు, మీడియా ఎంతో సహకరించిందన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల వల్ల ప్రజాస్వామ్యం బలపడిందన్నారు.

1977లో ఎన్నికలు జరిగే సమయానికి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధాన నేతలు జైళ్లలో ఉన్నారని, ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజాస్వామ్యం పైన గౌరవాన్ని ఆ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారన్నారు.

English summary
PM Modi hails Jayaprakash Narayan, says Emergency damaged India's democratic tradition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X