వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మతి తప్పింది..! ట్రీట్‌మెంట్ చేయించండన్న చత్తీస్‌గఢ్ సీఎం..

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీపై పీఎం నరేంద్రమోడీ చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బాఘెల్ మోడీని టార్గెట్ చేశారు. రాజీవ్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఘాటు విమర్శలు చేశారు.

రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ తప్పుబట్టారు. ఆయన మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో రాజీవ్‌గాంధీ ప్రస్తావన తేవడం మోడీ మతిస్థిమితం తప్పారనడానికి నిదర్శనమని అన్నారు. ఆయనకు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరమని అభిప్రాయపడ్డారు. రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని మోడీ గతంలో చెప్పిన విషయాన్ని బాఘెల్ గుర్తు చేశారు. ప్రతి మనిషికి కనీసం 7గంటల నిద్ర అవసరమని, కంటినిండా నిద్రపోని వారి మతితప్పడం సాధారణమేనని అన్నారు.

Modi Has Lost Mental Balance : Bhupesh Baghel

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధాని మోడీ తాను రోజుకు కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పాడు. పని ఒత్తిడి వల్ల ఎక్కువ సమయం పడుకునే అవకాశం దొరకదని అన్నారు.

English summary
Chhattisgarh Chief Minister Bhupesh Baghel has jumped into the bitter fight between Congress and BJP leaders over Prime Minister Narendra Modi's comments on former PM Rajiv Gandhi. Rajiv Gandhi ji passed away years ago, talking about him and that too during elections shows Modi ji has lost mental balance. He needs medical treatment. He says he only gets to sleep for three to four hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X