వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటీఎం లేకుంటే బహిష్కరణా, ఆర్బీఐకి అవమానం: రాహుల్ చినిగిన షర్ట్ (వీడియో)

నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని, ఆర్బీఐని సైతం ఖూనీ చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని, ఆర్బీఐని సైతం ఖూనీ చేశారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం నాడు మండిపడ్డారు.

నోట్ల రద్దు చేసినంత వేగంగా మిగతా నిర్ణయాలను మోడీ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఇవాళ ప్రజలు ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న ఎదురవుతోందన్నారు. పేటీఎం ఉందా, ఒకవేళ పేటీఎం లందేటం బయటకు వెళ్లిపొమ్మనే సమాధానం వస్తోందని ఆరోపించారు. పేటీఎం లేదంటే బహిష్కరిస్తారా అని నిలదీశారు.

ఎంతోమంది పేదలకు అన్నం పెడుతున్న చరఖా (రాట్నం) ముందు కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రధాని మోడీ కేవలం యాభై మంది బడాబాబులకు మేలు చేసే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

Modi impinging upon autonomy of institutions like RBI: Rahul

స్వాతంత్రం కోసం, త్రివర్ణ పతాకం కోసం మహాత్మా గాంధీ ఎనలేని త్యాగాలు చేశారన్నారు. ఇప్పుడేమో ఖాదీ క్యాలెండర్ మీద ఆయన ఫోటోను తొలగించి, మోడీ ఫోటోలు ముద్రించారన్నారు. కొన్నిచోట్ల రాంలీలా నాటకాల్లో రాముడి పాత్రధారికి మోడీ మాస్కులు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఏముంటుందన్నారు.

బీజేపీ, ఆరెస్సెస్ పైన కొన్ని నెలల పాట రీసెర్చ్ చేశానని, స్వాతంత్రానంతరం 52 ఏళ్ల పాటు నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకం లేదని తెలిసిందన్నారు. ఇదేనా వాళ్ల దేశభక్తి అన్నారు.

సిద్ధూ ఓ మానవబాంబు, ద్రోహి, తల్లిని మార్చేస్తాడా!: సుఖ్‌బీర్-హర్‌సిమ్రాత్సిద్ధూ ఓ మానవబాంబు, ద్రోహి, తల్లిని మార్చేస్తాడా!: సుఖ్‌బీర్-హర్‌సిమ్రాత్

రిజర్వ్ బ్యంకు విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఆర్బీఏ పటిష్టతకు, ఆర్థిక నిర్ణయాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, అలాంటి సంస్థను మోడీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో హత్య చేశారన్నారు.

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను కూడా పేదవాడినే అని చెప్పారు. తన కుర్తా చినిగిపోయందని సభకు హాజరైన వారికి చూపించారు. తాను కూడా పేద కుటుంబానికి చెందినవాడినే అన్నారు.

English summary
Accusing Prime Minister Narendra Modi of impinging upon the autonomy of institutions like the RBI, Congress Vice President Rahul Gandhi today said the Central Bank's Governor was informed of his decision on demonetisation just a day before the move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X