• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతుల ఆందోళనలు హైజాక్‌- ఇందిర చేసిన తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?

|

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా ఢిల్లీని ముట్టడించి సత్తా చాటేందుకు రైతులు సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత్‌ బంద్ నిర్వహించడం ద్వారా తామేంటో పాలకులకు చూపించిన అన్నదాతలు ఈ నెల 14న దేశవ్యాప్త రైల్‌ రోకోకు సిద్ధమవుతున్నారు. కేంద్రం మాత్రం వీరిని ఎలా ఎదుర్కోవాలో తెలియక దిక్కులు చూస్తోంది. ఇలాంటి సమయంలో రైతుల ఆందోళనల్లో అసాంఘిక శక్తులు చొరబడ్డారంటూ పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో పరిస్ధితులు విషమిస్తున్నాయి. అదే జరిగితే ఇది కచ్చితంగా మాజీ ప్రధాని ఇందిర హయాంలో జరిగిన తరహాలోనే మరో చారిత్రక తప్పిదంగా మారనుందని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు.

  #FarmLaws: Is modi following the footsteps of former pm indira gandhi
  రైతుల నిరసనలు హైజాక్‌...

  రైతుల నిరసనలు హైజాక్‌...

  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులు రాజధానిని దిగ్బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే రైతుల ఆందోళనల విషయంలో కేంద్రం కూడా ఎటూ తేల్చకపోవడంతో ఈ నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకూ రైతు సంఘాల నిరసనలు ఎక్కడా హింసాత్మకం కాలేదు. ఏ చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదు. గడ్డకట్టే చలిలో సైతం తిండీ తిప్పలు మాని నిరసనల్లో పాల్గొంటున్న రైతులు శాంతియుతంగానే తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  చర్చలకు ముందుకు రాని మోడీ...

  చర్చలకు ముందుకు రాని మోడీ...

  రైతు సంఘాల ఆందోళనలు తీవ్రమవుతున్నా, ఢిల్లీని దిగ్బంధించేందుకు వారు శతవిథాలా ప్రయత్నిస్తున్నా ప్రధాని మోడీ మాత్రం వారితో చర్చల విషయంలో నోరు మెదపడం లేదు. కేవలం వ్యవసాయ మంత్రి మాత్రమే తాము చర్చలకు సిద్దమనే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు గడ్డ కట్టే చలిలో ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం పట్ల సాధారణ ప్రజల్లో సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా కేంద్రం స్పందించడం లేదు. ఇవాళ ఫిక్కీ సదస్సులో పాల్గొన్న మోడీ వ్యవసాయ సంస్కరణలు తప్పవనే సంకేతాలు ఇచ్చారు. దీంతో చర్చలకు మోడీ ఆసక్తి చూపడం లేదని అర్ధమైంది. అసాంఘిక శక్తులు చొరబడ్డారనే కారణంతో రైతుల ఆందోళనలను అణగదొక్కేందుకే కేంద్రం సిద్ధమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

   ఇందిర తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?

  ఇందిర తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?

  1980వ దశకంలో సరిగ్గా ఇలాగే వ్యవసాయ సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇలాగే రైతుల ఆందోళనను చిన్నచూపు చూశారు. కేంద్రం వారి మంచి కోసం సంస్కరణలు తీసుకొస్తుంటే అర్ధం చేసుకోకుండా ఆందోళనలేంటని గర్జించారు. రైతులతో చర్చలు జరపబోమని తేల్చిచెప్పేశారు. దీంతో రైతుల ఆందోళనలు కొనసాగాయి. వాటిలో అసాంఘిక శక్తులు కూడా చొరబడ్డాయి. చివరకు వాటి ప్రభావం తర్వాత పదేళ్ల పాటు దేశంపై పడింది. ఓవైపు రైతులు సాగును వదిలిపెట్టడంతో వ్యవసాయ ఉత్పత్తుల కొరత ఏర్పడింది. కేంద్రం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ కూడా ఇందిర తరహాలోనే తప్పిదం చేస్తున్నారని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. చర్చలకు ఆసక్తి చూపకపోవడం ద్వారా మోడీ ఇందిర తప్పిదాన్నే పునరావృతం చేస్తున్నారని, దీని మూల్యం అందరూ చెల్లించుకోక తప్పదని వారు చెప్తున్నారు.

  English summary
  is prime minister narendra modi following the footsteps of former pm indira gandhi over farmers' protests ? some of the farmer leaders opined that he has been doing the same over talks between centre and farmers' unions.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X