• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

5రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు -మార్చి 7న షెడ్యూల్ -ఈసీ కంటే ముందే మోదీ హింట్ -బీజేపీ పక్కా

|

సార్వత్రిక ఎన్నికలైన రెండేళ్లకు దేశంలో మినీ సంగ్రామానికి తెరలేవనుంది. ఈశాన్య, తూర్పు, దక్షిణాదిలోని కీలకమైన పెద్ద రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత రాష్ట్రానికీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుస పర్యటనలతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటనే తరువాయి అని భావిస్తుండగా, దానికంటే ముందే పోల్ షెడ్యూల్ పై ప్రధాని మోదీ హింట్ ఇచ్చేశారు...

viral video: ఈ నేతను గుర్తుపట్టారా? -ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా మోపెడ్‌పై..

 మార్చి 7న షెడ్యూల్..

మార్చి 7న షెడ్యూల్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతం(2016)లో మార్చి నాలుగో తేదీన షెడ్యూల్‌ను ప్రకటించారని, ఈసారి కూడా అదే తేదీల్లో ప్రకటన వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం ఎన్నికల కమిషన్ విధి అంటూనే తేదీలను మోదీ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..

 బెంగాల్, అస్సాంలో మోదీ పర్యటన

బెంగాల్, అస్సాంలో మోదీ పర్యటన

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఎన్నికల వేళ రెండు రాష్ట్రాలకూ కేంద్రం తరఫున కీలక ప్రాజెక్టులు ప్రకటించారు. ఈసీ కంటే ముందే అంచనా తేదీలను వెల్లడించిన మోదీ.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక మునుపే అసోం ,బెంగాల్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని, అలాగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోనూ పర్యటిస్తానని ప్రకటించారు. ఒకవేళ మార్చి ఏడో తేదీన గనక ఎన్నికల షెడ్యూల్ వస్తే... వీలైనంత తొందర్లోనే మరోసారి అసోం పర్యటనకు వస్తానని ఆయన తెలిపారు. కాగా,

అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్

అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్

ఈశాన్యంలో అతిపెద్ద రాష్ట్రమైన అస్సాంలో గడిచిన ఐదేళ్లుగా బీజేపీ సర్కారు కొనసాగుతుండటం తెలిసిందే. సోమవారం రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు అసోంపై సవతి తల్లి ప్రేమను చూపించాయని, అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నా, గత పాలకులెవరూ పట్టించుకోలేదని విమర్శించారు. అయితే, ఇప్పుడున్న సీఎం శర్వానంద సోనోవాల్ మాత్రం ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' నినాదంతో ముందుకెళుతున్నారని, కీలకమైన బ్రిడ్జిలు, రోడ్లతోపాటు విద్యుత్, విద్య విషయంలో కేంద్రం నుంచి అస్సాంకు రూ.3,000 కోట్లను కేటాయించామని మోదీ తెలిపారు. ప్రధాని పర్యటనలో ‘అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది'అనే నినాదాలు వినిపించాయి. ఇక..

బెంగాల్‌లో మార్పు తథ్యం..

బెంగాల్‌లో మార్పు తథ్యం..

అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్ లోనూ సోమవారం పర్యటించిన ప్రధాని.. హౌరాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈసారి బెంగాలీలు మార్పునకు సంసిద్ధంగా ఉన్నారని, తన సభకు భారీ సంఖ్యలో జనం రావడమే ఇందుకు తార్కాణమని అన్నారు. అస్సాంలాగే బెంగాల్ లోనూ ప్రధాని వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కేంద్రం ప్రకటించిన పథకాలు బెంగాల్ ప్రజల్లోకి వెళ్లకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీ చేస్తోందని, అందుకే తృణమూల్ నేతలు నానాటికీ సంపన్నులుగా మారుతున్నారని, ప్రజలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారని విమర్శించారు. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే అవినీతి రహిత, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్న రాష్ట్రంగా బెంగాల్ ను మలుస్తామని మోదీ హామీ ఇచ్చారు.

నిమ్మగడ్డ వల్ల జగన్‌‌‌కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ 'మిషన్ భగీరథ'

English summary
Prime Minister Narendra Modi on Monday hinted that the Election Commission (EC) may declare the Assembly Election dates in the poll bound states by March 7. While addressing a public meeting at Silapathar in Assam Dhemaji district, PM Modi said, “Last time in 2016, the Assembly poll dates were announced on March 4. This year, it is my assumption that EC will announce the dates for Assembly Polls by March 7.” Modi in West Bengal, Assam on monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X