వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

modi: అతిపెద్ద స్టేడియాలే కాదు, ఆరోగ్య పథకాలు కూడా, ‘నమస్తే ట్రంప్‌’సభలో ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

'నమస్తే ట్రంప్' సభలో మోడీ, ట్రంప్ ఒకరికొకరు ఆకాశానికెత్తుకునే ప్రసంగాలు చేశారు. ప్రపంచంలో అత్యంత పెద్ద స్టేడియంలో సభ ఏర్పాటు చేసి, అమెరికా పట్ల ప్రేమను చాటుకొన్నారని ట్రంప్ అనగా.. దానికి కొనసాగింపుగా మోడీ మాట్లాడారు. తమ వద్ద అతి పెద్ద స్టేడియలే కాదు అతి పెద్ద ఆరోగ్య పథకాలు కూడా ఉన్నాయని కంటిన్యూ చేశారు.

ఒకేసారి ఎక్కువ రాకెట్లను పంపించి రికార్డు సృష్టిస్తున్నామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావంచారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాజ్యం కూడా భారత్ అని పేర్కొన్నారు. దేశంలో అతి పెద్ద స్టేడియాలే కాదు.. అత్యంత పెద్ద ఆరోగ్య పథకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదైన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ దేశంలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

modi: India has not just biggest stadium, also biggest health scheme

Recommended Video

Namaste Trump : Donald Trump India's visit - LIVE From Ahmedabad || Oneindia Telugu

నవ భారత దేశాన్ని నిర్మించేందుకు 130 కోట్ల మంది భారతీయులు శ్రమిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. తమ దేశాభివృద్ధి కోసం యువత అవిశ్రాంతంగా శ్రమిస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వారి ఆకాంక్షల మేరకు లక్ష్యాలను చేరుకుంటామని మోడీ తెలిపారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి గర్వపడుతారని, ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ప్రధాని మోడీ తెలిపారు. అమెరకా స్వేచ్చ భూమి అయితే భారత్ ఐకమత్యంతో కలిసి ఉండే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. మెలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఆమె భర్తను ప్రధాని మోడీ ప్రసంశలతో ముంచెత్తారు.

English summary
PM Modi says, "India doesn't only have the biggest cricket stadium, but also the largest health insurance scheme in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X