వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'Main Bhi Chowkidar': సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశం

|
Google Oneindia TeluguNews

Recommended Video

సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశం...!! | Oneindia Telugu

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 'Main Bhi Chowkidar' ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్తోన్న కామెంట్లనే ప్రచారాస్త్రంగా మలచుకున్నారు మోదీ. ఔను నేను కాపాలదారుడినేనని ప్రకటించి ... వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మోదీ. తన ట్విట్టర్ ఖాతాలో తన పేరుకు ముందు కూడా 'Main Bhi Chowkidar' అని జతచేశారు. ఈ క్రమంలో ఇవాళ కాపాలాదారులు .. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశవుతారని బీజేపీ మీడియా సెల్ పేర్కొన్నది.

ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్

రంగేళికి ఒకరోజు ముందు ...

రంగేళికి ఒకరోజు ముందు ...

హోళి పండుగకు ఒకరోజు ముందు సెక్యూరిటీ గార్డులతో ప్రధాని మోదీ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం ఆడియో బ్రిడ్జ్ టెక్నాలజీ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులతో మోదీ భేటీ అవుతారు. ఆ తర్వాత ఈ నెల 31న దేశంలోని సెక్యూరిటీ గార్డులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని మీడియా సెల్ కన్వీనర్ అనిల్ బలునీ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ కూడా ....

వీడియో కాన్ఫరెన్స్ కూడా ....

6'Main Bhi Chowkidar' హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే కాపాలాదారులతో మోదీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గార్డులతో మోదీ సమావేశం .. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్‌కు అద్దం పడుతోందని ఒక ప్రకటనలో తెలిపారు. 'Main Bhi Chowkidar' హ్యాష్‌ట్యాగ్‌కు ఇప్పటికే దేశంలోని 20 లక్షల మంది నెటిజన్లు ట్వీట్ చేశారని ఆయన పేర్కొన్నారు.

అన్నివర్గాల వారితో ...

అన్నివర్గాల వారితో ...

'Main Bhi Chowkidar' ఉద్యమంలో ఇప్పటికే కోటి మంది భాగస్వామ్యులయ్యారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలోనే 31వ తేదీన దేశంలోని 500 ప్రాంతాల నుంచి కాపాలాదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారని చెప్పారు. ఒక ఢిల్లీలోనే కాదు .. ఇతర ప్రాంతాలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానమవుతోందన్నారు. ఇందులో కార్యకర్తలు, నేతలు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, రిటైర్డ్ సైనికులు, యువత, క్రీడాకారులు, మహిళలు పాల్గొంటారని వెల్లడించారు.

English summary
To intensify the "Main Bhi Chowkidar" campaign, Prime Minister Narendra Modi would interact with people, mainly security guards, across the country through audio bridge technology on Wednesday a day ahead of Holi, the festival of colours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X