వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో ఆ సాధారణ కుటుంబ సభ్యులకు మోడీ ప్రత్యేక ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్: ప్రధాని నరేంద్ర మోడీ మంచి సంస్కృతికి తెరతీశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల నుంచే అతిథులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం మోడీ ప్రమాణ స్వీకారంలో కొందరు కొత్త అతిథులు కనిపించనున్నారు. బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. వీరి కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక మొత్తంగా 50 కుటుంబాలను ఈ కార్యక్రమానికి మోడీ ఆహ్వానించారు.

ఓ నివేదిక ప్రకారం గత ఆరేళ్లలో ఎన్నికల జరిగిన సందర్భంలో నిన్నటి లోక్‌సభ పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లో చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు 51 మంది మృతి చెందారు. వీరి కుటుంబ సభ్యులను ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. తృణమూల్ కార్యకర్తల చేతిలో తన తండ్రి హత్యకు గురయ్యాడని బెంగాల్‌ మిద్నాపూర్ బీజేపీ కార్యకర్త మను హన్సద్ కొడుకు చెప్పాడు. అయితే ఢిల్లీ నుంచి పిలుపు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ప్రస్తుతం తమ ప్రాంతంలో శాంతి నెలకొందని హన్సద వెల్లడించాడు. ఇదిలా ఉంటే మిద్నాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విజయం సాధించారు.

Modi invites for the swearing ceremony of the families of BJP workers who were killed in Poll violence

బెంగాల్‌లో ఒకప్పుడు రెండు సీట్లు గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 18 సీట్లు గెలుచుకుని ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో బీజేపీ ఆ రాష్ట్రంపై కన్నేసింది. మమతా బెనర్జీకి బీజేపీ పెద్ద తలనొప్పిగా తయారైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఆదివారం బీజేపీ నేత ముకుల్ రాయ్ 50 మంది తృణమూల్ కౌన్సిలర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లారు.వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మమతా బెనర్జీకి మరో షాక్‌ ఇచ్చినట్లయ్యింది. ఇక భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
BJP has invited the families of over 50 party workers who were killed in different incidents of violence in Bengal, to the swearing-in ceremony of PM Narendra Modi. West Bengal Chief Minister Mamata Banerjee is also expected to attend the event on May 30.According to a report, at least 51 BJP workers were killed in West Bengal in the past six years during panchayat elections and the recently-concluded Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X