వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలు

|
Google Oneindia TeluguNews

ముంబై: కాంగ్రెస్‌లో చేరి ఒక రోజు పూర్తయిన వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అసహనం పెరిగిపోయిందని ఊర్మిళా విమర్శించారు. పార్టీలో చేరిన రెండో రోజే ఊర్మిలా మోడీ విధానాలను ప్రశ్నించారు. అంతేకాదు పలు ఆరోపణలు కూడా ఆమె సంధించారు.

పేదలకు మోడీ అన్యాయం చేశాడు...న్యాయ్ పథకంతో మేము న్యాయం చేస్తాం: రాహుల్ గాంధీ పేదలకు మోడీ అన్యాయం చేశాడు...న్యాయ్ పథకంతో మేము న్యాయం చేస్తాం: రాహుల్ గాంధీ

మోడీ విధానాలు సరిగ్గా లేవు

మోడీ విధానాలు సరిగ్గా లేవు

వ్యక్తిగతంగా మోడీ మంచివాడే అన్న ఊర్మిళా... ఆయన తీసుకొస్తున్న విధానాలు అమలు చేస్తున్న విధానాలు సరిగ్గా లేవని విమర్శించారు. ఇక కాంగ్రెస్‌లో తన చేరిక గురించి మాట్లాడిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ... జాతిపిత గాంధీజీ, నెహ్రూల గురించి చాలా పుస్తకాలు చదివినట్లు తెలిపారు. అంతేకాదు... తమ కుటుంబం ఎప్పటినుంచో కాంగ్రెస్ భావజాలాన్ని ఫాలో అవుతున్నారంటూ చెప్పుకొచ్చారు.

మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది

మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది

భారత దేశం ఒక ప్రజాస్వామ్యదేశం అన్న ఊర్మిళా... ఇక్కడ ఒక వ్యక్తి స్వేఛ్ఛగా జీవించొచ్చు అని చెప్పారు. ఒక వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తన ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పిన ఊర్మిళా... ఈ రోజు పరిస్థితి దేశంలో అలా లేదన్నారు. మతపరమైన అంశాలను రుద్ది బీజేపీ ప్రజలమధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కేవలం మతం అనే సాకు చూపించి ప్రజల మధ్య విబేధాలను కాషాయం పార్టీ సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో విపరీతమైన విద్వేషాలు ప్రజల మధ్య నెలకొని ఉన్నాయన్న రంగీళా బ్యూటీ.... మతం పేరిట హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు.

బాలీవుడ్‌లో మతం ఆధారంగా ఆర్టిస్టులను గౌరవిస్తున్నారు

బాలీవుడ్‌లో మతం ఆధారంగా ఆర్టిస్టులను గౌరవిస్తున్నారు


దేశంలో అసహనం గురించి రాజకీయాల్లోకి రాకముందు ఎందుకు ప్రస్తావించలేదన్న ప్రశ్నకు ఊర్మిళా సమాధానం ఇచ్చారు. తను కుటుంబ సభ్యులతో ఈ విషయమై పదే పదే చర్చించినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడు తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా నిలిచిందన్నారు. ఇకపై తనలో దాగి ఉన్న అభిప్రాయాలన్నిటినీ నాలుగు గోడల మధ్య కాకుండా బహిరంగంగానే వ్యక్త పరుస్తానని చెప్పుకొచ్చారు.

ఇక తన రాజకీయ ఎంట్రీపై మాట్లాడిన ఊర్మిళా... కేవలం ఎన్నికల్లో పోటీచేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. చాలా అంశాలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. దీర్ఘకాలంలో తను అన్ని అంశాలపై పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను బరిలో ఉంటానా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు.కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో బీజేపీ ఆమెను ట్రోల్ చేసింది. అయితే తనను ట్రోల్ చేసే సమయాన్ని బీజేపీ రైతుల బాగుకోసం, ప్రజల మేలుకోసం కేటాయించింటే వారి బతుకులు బాగుపడి ఉండేవని చెప్పారు. బాలీవుడ్‌లో ఆర్టిస్టులు మతం పేరుతో దూషించబడుతున్నారని, దేశం విడిచి వెళ్లాలని కొందరు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఊర్మిళా.

English summary
A day after Urmila Matondkar joined the Congress, the actor blamed the government led by Prime Minister Narendra Modi for growing intolerance in the country.On her second day in politics, Urmila Matondkar made a series of allegations and questioned the Modi government and its policies."Personally Modi is good, but his policies are not," Urmila Matondkar said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X