• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

year ender 2020- మోడీ ప్రజాదరణ, బీజేపీ జైత్రయాత్ర- రేటింగ్స్‌లో భారత్‌ పతనం

|

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరోనా ప్రభావమైతే, రెండవది బీజేపీకి, ప్రధాని నరేంద్రమోడీకి పెరుగుతున్న ఆదరణ. అయితే అంతర్జాతీయంగా మాత్రం రేటింగ్స్‌లోనూ, అభివృద్ధి సూచికల్లోనూ ఈ ఏడాది భారత్‌ గతంతో పోలిస్తే నానాటికీ పతనం అవుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఏడాది చివర్లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశంలో మొదలైన రైతుల ఆందోళనలు సైతం అంతర్జాతీయంగా భారత్‌ పరువు తీస్తున్నాయి.

 మోడీ వెలుగులతో బీజేపీ జైత్రయాత్ర...

మోడీ వెలుగులతో బీజేపీ జైత్రయాత్ర...

ఈ ఏడాది ఎన్డీయే సర్కారు ఏడేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడేళ్లలో చూసినా, గతేడాది సార్వత్రి ఎన్నికల అనంతరం చూసినా దేశవ్యాప్తంగా మోడీ ప్రజాదరణ, బీజేపీ విస్తరణ నిరాటంకంగా సాగిపోతున్నాయి. దేశ ప్రజలు రెండోసారి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెడుతూ ప్రధాని మోడీ పాలనలో తన ముద్ర చూపిస్తున్నారు.

అన్నింటికంటే మించి మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నకు అవకాశం లేకుండా చేసేశారు. దీంతో మోడీ విషయంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానాల్లేవు. అటు బీజేపీ కూడా ఈ ఏడేళ్లలో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తోంది. బీహార్‌, మహారాష్ట్ర, రాజస్ధాన్‌ వంటి రాష్ట్రాల్లో అప్పుడప్పుడూ ఎదురుదెబ్బలు తగిలినా మిగతా చోట్ల వాటిని మరిపించే విజయాలు కాషాయ సేన సొంతమవుతున్నాయి.

 ఎన్డీయే సర్కారుకు ఎదురుదెబ్బలు...

ఎన్డీయే సర్కారుకు ఎదురుదెబ్బలు...

దేశవ్యాప్తంగా మోడీ, బీజేపీ ప్రజాదరణ పెంచుకుంటున్నా ప్రభుత్వం విషయానికొచ్చేసరికి మాత్రం వీరిద్దరూ ఎదురుదెబ్బలు తినక తప్పడం లేదు. ముఖ్యంగా విధానపరమైన నిర్ణయాల విషయంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా సమయంలో కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే అది ఎవరికి చేరిందో తెలియని పరిస్ధితి ఇప్పటికీ కనిపిస్తోంది. అలాగే ఆ తర్వాత ప్రకటించిన రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనం కూడా తమకు కలిగిందని ఎవరూ చెప్పలేని పరిస్ధితి.

వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు దేశంలో రైతులకే కాదు సగటు ప్రజలకీ నచ్చలేదు. కేంద్రంలో మెజారిటీతో బిల్లులు నెగ్గించుకున్నా ఇప్పుడు వాటిపై రైతుల ఆందోళనలతో దేశంలోనే కాదు విదేశాల్లో సైతం కేంద్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇదే కారణంతో చిరకాల మిత్రపక్షం అకాలీదళ్ కూడా దూరమైంది.

 అంతర్జాతీయ రేటింగ్స్‌లో పతనం..

అంతర్జాతీయ రేటింగ్స్‌లో పతనం..

రాజకీయంగా సాధిస్తున్న వరుస విజయాల మాటున మోడీ సర్కారు వైఫల్యాలన్నీ జనానికి కనిపించకుండా పోతున్నాయనుకుంటే పొరబాటే. దేశంలో బీజేపీ, మోడీలకు గట్టి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వారే గతి అని ప్రస్తుతానికి జనం అనుకుంటున్నా.. అంతర్జాతీయంగా మాత్రం భారత్‌ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పొరుగున ఉన్న పేద దేశం బంగ్లాదేశ్‌ జీడీపీ కూడా భారత్‌ను దాటి పోతుంటే మనం దిక్కులు చూడాల్సిన పరిస్ధితి. తాజాగా ఐరాస ప్రకటించిన మానవాభివృద్ధి సూచికతో పాటు హ్యూమన్‌ ప్రీడమ్‌ ఇండెక్స్‌లోనూ భారత్ ర్యాంకు మరింత పతనమైంది. ఈ ర్యాంకింగ్స్ బట్టి చూస్తే భారత్‌ ఆర్ధికంగా, సామాజికంగా స్వేచ్ఛాయుతంగా అభివృద్ధి చెందడం మాట అటుంచి కేంద్రం పౌరుల కనీస హక్కులు కూడా కాలరాస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.

భారత్‌లో ఆర్ధిక స్వేచ్ఛ విషయంలో గతంలో 79గా ఉన్న భారత్‌ ర్యాంకు తాజాగా 105కు పతనం కావడం ఆందోళనకరంగా మారింది.తాజాగా కేంద్రం విడుదల చేసిన కుటుంబ ఆరోగ్య సర్వేతో పాటు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లోనూ భారత్‌ పరిస్ధితి చూస్తుంటే ఒకప్పుడు ప్రపంచ ధాన్యాగారంగా ఉన్న భారత్‌ దుస్ధితి అర్ధమవుతుంది..

 ప్రజాదరణ మాటున అభివృద్ధి కనుమరుగు...

ప్రజాదరణ మాటున అభివృద్ధి కనుమరుగు...

గతంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి భారీగా మార్కెటింగ్‌ చేసుకున్న స్వచ్ఛభారత్‌ ఏమైందో తెలియడం లేదు. ఇదే కోవలో జాతీయ పౌష్టికాహార మిషన్‌ పరిస్ధితి చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా తయారైంది. ఐదేళ్లుగా ఆర్ధికాభివృద్ధికి సంబంధించిన అన్ని సూచికల్లోనూ భారత్‌ పతనం స్పష్టంగా కనిపిస్తోంది.

జీడీపీ వృద్ధి, రెవెన్యూ లోటు, బడ్జెట్‌ హామీల అమలు, ఇతర పథకాల అమలు ఇలా ఏ విధంగా చూసుకున్నా నరేంద్రమోడీ సర్కారు దేశానికి చేసిందేమీ లేదనేది సుస్ఫష్టమవుతోంది. అయినా ప్రత్యామ్నాయం లేదన్న కారణంతో వ్యతిరేకత తగ్గించుకుంటూ సర్కారు కాలం గడిపేస్తోంది. అయితే ఈ వెసులుబాటు సర్కారుకు ఎక్కువ కాలం ఉండకపోవచ్చనినిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary
As this troubled year comes to an end, Prime Minister Narendra Modi should have some concerns. India is looking worse than before on many key indicators, and we aren’t referring to the pandemic year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X