వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్! 8 ట్రక్కుల చెత్త ఎత్తారు: ప్రియాంకకు మోడీ పొగడ్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢీల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పైన ప్రశంసలు కురిపించారు. ప్రియాంకను పొగుడుతూ ఆయన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఆమె వినూత్న ప్రయత్నం చేశారన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రజలను ఒక్క దగ్గరకు చేర్చేందుకు ఆమె ప్రయత్నం బాగుందని కొనియాడారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొమ్మిది మందిని నామినేట్ చేశారు. ఆయన నామినేట్ చేసిన వారిలో పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు.

Modi lauds Priyanka Chopra's innovative Clean India effort

ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా కేవలం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయలేదు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వెర్సోవా ప్రాంతం బాధ్యతను కూడా ఆమె తీసుకున్నారు. అక్కడ చెత్తాచెదారాల్లో ఆడుతున్న పిల్లల్ని చూసి కలత చెందారు. మొక్కుబడిగా కాకుండా.. పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు.

అందులో ప్రియాంక మాట్లాడుతూ.. ఒక్కసారి శుభ్రం చేయడం మాత్రమే కాదని, మనం చేసే పనిలో ఫలితం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రియాంక చోప్రా మరికొందరు దాదాపు ఎనిమిది ట్రక్కుల చెత్తను ఆమె బాధ్యత తీసుకున్న ప్రాంతం నుండి తరలించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానికులకు సూచించారు.

కాగా, ప్రియాంక చోప్రా పలువురిని నామినేట్ చేశారు. సన్ ఫౌండేషన్ విక్రంజీత్ ఎస్ సహ్నే, సిద్ధార్థ రాయ్ కపూర్, ప్రణయ్ రాయ్, విక్రమ్ చంద్ర అండ్ ఎన్డీటీవీ బృందానికి, మధుర్ భండాక్రక్, ముంబై టాక్సీ యూనియన్, ముంబై ఆటో రిక్షా యూనియన్, లయన్స్ క్లబ్ ముంబై, కనిక సదానంద్ తదితరులను నామినేడ్ చేశారు.

English summary
PM Narendra Modi has lauded actor Priyanka Chopra for her innovative contribution towards Swacch Bharat Abhiyaan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X