• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జయ ఆరోగ్యంపై ఆందోళన, కేంద్రం ఆరా: మోడీ వచ్చే అవకాశం

|

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. అపోలో ఆస్పత్రి వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిర్ణయం తీసుకోలేదు: పీఎంఓ

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ చెన్న‌ైకి వ‌స్తున్నార‌న్న వార్త‌ల‌పై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ మేర‌కు ఓ ప్రకటన విడుదల చేస్తూ అందులో మోడీ చెన్నై పర్యటనపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పింది. నరేంద్ర మోడీ చెన్నై వచ్చి జయలలితను పరామర్శించనున్నారని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో పీఎంవో కార్యాల‌యం ఈ ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది.

జయ ఆరోగ్యం: ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

జయకు గుండెపోటు

జయకు గుండెపోటు

ఆదివారం తీవ్ర గుండెపోటు రావడంతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత ఆరోగ్యం కొంత విషమంగానే ఉందని, చికిత్స తర్వాత కోలుకునే అవకాశం ఉందని, అందరూ ఆమె కోలుకోవాలని ప్రార్థించాలని అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

భావోద్వేగ వాతావరణం

భావోద్వేగ వాతావరణం

ఈ క్రమంలో తమిళనాడులో కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తం��ా ఆమె అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చే బస్సులను రద్దు చేయడం జరిగింది. మొదట పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినప్పటికీ.. సోమవారం పాఠశాలలకు అనుమతినిచ్చారు.

కేంద్రం ఆరా

కేంద్రం ఆరా

జయలలిత ఆరోగ్యంపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబై నుంచి హుటాహుటిన అపోలో ఆ���్పత్రికి వెళ్లిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. కేంద్రానికి జయ ఆరోగ్యంపై సమాచారమిచ్చారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. గవర్నర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కోలుకోవాలంటూ..

కోలుకోవాలంటూ..

కాగా, జయలలిత త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతోపాటు వెంకయ్యనాయుడు, దేవేంద్ర ఫడ్నవీస్, మమతా బెనర్జీ, సిద్ధా రామయ్య, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

 మోడీ వచ్చే అవకాశం

మోడీ వచ్చే అవకాశం

జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెన్నై లోని అపోలో ఆస్పత్రికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే రాజ్‌నాథ్ సింగ్ తోపాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

జయ సోదరి కుమార్తె పరామర్శ

జయ సోదరి కుమార్తె పరామర్శ

ఇప్పటికే ఆమె��ు అపోలో వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. జయ ఆరోగ్యంపై మధ్యాహ్నం బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమెకు ఎక్మో(ఈసీఎంఓ) ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, జయలలిత సోదరుడి కుమార్తె దీపా.. జయలలితను ఆస్పత్రిలో పరామర్శించారు. ఆమె త్వరలోనే కోరుకుంటారని చెప్పారు.

కొంత సంక్లిష్టమే..

కొంత సంక్లిష్టమే..

గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హృద్రోగ, శ్వాసకోశ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయలలితకు మధుమేహం ఉండటంతో చికిత్సలో సంక్లిష్టత నెలకొన్నట్లు తెలుస్తోంది.

లండన్, ఎయిమ్స్ డాక్లర్లకు పిలుపు

లండన్, ఎయిమ్స్ డాక్లర్లకు పిలుపు

జయకు గతంలో చికిత్స అందించిన లండన్‌ వైద్యుడు ���ిచర్డ్‌ బేలె వెంటనే రావాలని అపోలో వైద్యులు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటుగా ఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని పంపాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ ఎయిమ్స్‌ వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపేందుకు చర్యలు చేపట్టింది.

English summary
It said that PM Narendra Modi may come to Chennai Apollo on Monday to meet Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X