వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసిన మోడీ... గొప్ప రాజనీతిజ్ఞుడి ఆశీస్సులు పొందానంటూ ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ... ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు సీనియన్ నేతలను నాయకులను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మోడీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఒక గొప్ప వక్తగా, రాజకీయ వేత్తగా ఇప్పటికే ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ... వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ అంటే తనకు ఎంతో గౌరవమని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో చెప్పారు కూడా.

ఇక మంగళవారం మాజీరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసానికి వెళ్లి స్వయంగా ప్రధాని మోడీ కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మోడీ సాధించిన ఘనవిజయం పట్ల అభినందనలు తెలిపారు. మిఠాయి కూడా మోడీకి ప్రణబ్ తినిపించారు.తాను ప్రణబ్‌తో సమావేశమైనట్లు తెలుపుతూ ఇద్దరు కలిసి పంచుకున్న మధురమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను మోడీ ట్వీట్ చేశారు.

Modi meets former President Pranab Mukherjee and takes his blessings

ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని మోడీ కొనియాడారు. అతనికున్న జ్ఞానం అద్భుతమైందన్నారు. మన దేశాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి ప్రణబ్ అని మోడీ పేర్కొన్నారు. ఈరోజు కలిసి ఈ అపరమేధావి ఆశీస్సులు తీసుకున్నట్లు మోడీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక దాదాపు గంట పాటు సమావేశమైయ్యారు ప్రణబ్ మోడీ.

మోడీ చేసిన ట్వీట్‌కు ప్రణబ్ ముఖర్జీ కూడా తిరిగి రీట్వీట్ చేశారు. తమ మధ్య సమావేశం చాలా బాగా జరిగిందని ప్రధాని మోడీ తను అనుకున్న సబ్కాసాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సాధించాలని ఆశిస్తూ తనకు అభినందనలు తెలుపుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి రాష్ట్రపతిగా సేవలందించారు. మోడీ ప్రభుత్వంలోనే ఆయన్ను భారతరత్న వరించింది.

English summary
Prime Minister Narendra Modi met former President Pranab Mukherjee this morning, two days before he takes oath for his second term. He described Mr Mukherjee as a "statesman".PM Modi tweeted a picture of Mr Mukherjee feeding him sweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X