నాకు కాదు మోదీకి నిద్రపట్టడం లేదు : ప్రధాని కామెంట్లపై దీదీ గుస్సా
కోల్ కతా : ప్రధాని మోదీ వ్యాఖ్యలను దీదీ మమత బెనర్జీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ తర్వాత మమతకు నిద్రపట్టడం లేదని మోదీ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు. ఓటమి భయంతోనే మోదీ తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు మమత. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతానని మోదీకి ముందే తెలుసు .. దాని గురించి ఆలోచిస్తూ విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం పానిఘటలో ప్రచారం నిర్వహించారు.

త్రిపురలో గెలిస్తే చాలా ?
మే 23 ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అవుతాయని మమతా ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిపురలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియదు. కానీ ఆ రాష్ట్రమే బీజేపీకి 543 స్థానాలు తెచ్చిపెట్టదు కదా ? అని ప్రశ్నించారు. ఏం చేయలేని మోదీ బెంగాల్ చుట్టూ తిరిగి మత ప్రాతిపదికన ప్రజలను వేరుచేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు తెలుసు ?
బెంగాల్ కు దీదీ చేసిందేమీ లేదనే ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలుసు. 150కి పైగా అమాయక జనం క్యూ లైన్ లో నిల్చొని ప్రాణం వదిలారు. ఫలితాల తర్వాత బీజేపీకి తాము చేసిన తప్పులు తెలిసి వస్తాయని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications