వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫ్ నియత్, సహీ వికాస్‌: 2019 ఎన్నికలకు కొత్త నినాదం ఇచ్చిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

గుజరాత్: 2019 ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉన్న నేపథ్యంలో రాజకీయపార్టీలు తమ వ్యూహాలకు పదను పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్ష ఇళ్లను ఆయన ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇది అక్కచెళ్లెమ్మలకు రాఖీ సందర్భంగా తన ప్రభుత్వం ఇచ్చే కానుకగా ప్రధాని అభివర్ణించారు. అంతేకాదు ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ఈ వేదికపై నుంచి కొత్త నినాదాన్ని ఇచ్చారు.

2019 ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ "సాఫ్ నియత్, సహీ వికాస్" (మంచి ఉద్దేశం , సంపూర్ణ అభివృద్ధి)అనే కొత్త నినాదం ఇచ్చారు. సబ్‌కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో 2014 ఎన్నికలకు బీజేపీ వెళ్లింది. గుజరాత్‌లోని వల్సద్ జిల్లాలో జుజ్వా గ్రామంలో ప్రధాని పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. దాదాపు లక్ష 15వేల ఇళ్లను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు ప్రధాని. ఇందుకు అయిన ఖర్చు రూ.1,727 కోట్లు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో ఆయన వీడియో ద్వారా మాట్లాడారు.

Modi pitches new slogan Saaf Niyat Sahi Vikas for 2019 elections

తమ ప్రభుత్వం మంచి ఉద్దేశం, సంపూర్ణ అభివృద్ధితో దూసుకెళుతోందని చెప్పిన ప్రధాని మిమ్మలను ఎవరైనా మోసం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలతో ఈరోజు తనకు మాట్లాడే అవకాశం వచ్చిందన్న ప్రధాని ప్రధానమంత్రి ఆవాస్ యోజనకింద లబ్ధి పొందిన మహిళకు ఇది తమ ప్రభుత్వం ఇచ్చే రాఖీ కానుక అని అన్నారు. ఈ గృహాలను రాఖీ పర్వదినానికి ముందు ఇవ్వడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పిన ప్రధాని ఈ ఇళ్లులు ఎంతో అద్భుతంగా ఉన్నాయని... అక్క చెళ్లెమ్మలకు కేటాయించే సమయంలో దళారులు జోక్యం లేకుండా చేశామని చెప్పారు.

నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోడీ గుర్తుచేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి రూపాయిలో ఒక్క పైసా మాత్రమే అర్హులకు చేరుతుందని గతంలో రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారని... కానీ తమ ప్రభుత్వంలో ప్రతి రూపాయి అర్హులకు చేరుతోందని గుర్తు చేశారు. ఈ దేశంలో చాలామంది గిరిజన ముఖ్యమంత్రలు పనిచేశారు. కానీ తమ ప్రభుత్వమే ఇప్పటి వరకు ప్రతి గిరిజన ప్రాంతానికి నీరు ఇవ్వడం, ఇతర సమస్యలు తీరుస్తోందని చెప్పారు. అస్టల్ గ్రూప్ నీటి సరఫరా పథకం ద్వారా 200 నుంచి 300 ఇళ్లు ఉన్న అతి చిన్న గ్రామానికి కూడా నీటి సరఫరా చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday set rolling a new slogan, ''Saaf Niyat, Sahi Vikas'', about his government as he gave away over 1 lakh houses to women under the flagship Pradhan Mantri Awaas Yojana (rural) scheme, calling it a Raksha bandhan gift.The Modi government''s oft-mentioned slogan has been ''Sabka Saath, Sabka Vikas'' right from the BJP''s election campaign ahead of the 2014 Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X