వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీకి రాఫెల్ మ‌ర‌క‌లు..! బీజేపీ ప్ర‌భుత్వానికి రాహుల్ గాంధీ చుర‌క‌లు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/ ఢిల్లీ : దేశ రక్షణకు సంబంధించిన 'రాఫెల్' విమానాల కొనుగోలులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది బీజేపి ప్ర‌భుత్వం. అదీ ఏకంగా ప్రధాని మోడీ పాల‌న‌కే అవినీతి మరక అంటే స్థాయిలో ఆరోప‌ణ‌లు వెల్ల‌వెత్తున్నాయి. రాఫెల్ డీల్ ను రక్షణ శాఖపై మోడీ సర్కారు జరిపిన సర్జికల్ స్ట్రైయిక్ గా కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తోంది. అంతే కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాషాయ ప్ర‌భుత్వం పై ఆరోప‌ణ‌ల అస్త్రాలు సందిస్తున్నారు. తాజా పరిణామాలతో చౌకీదార్ గా ఉంటానన్న వ్యక్తి 'చోర్' అని తేలిపోయిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇంత రాద్దాంతం వెన‌క ఓ మ‌హిళా అదికారి చ‌క్రం తిప్పార‌న్న వార్త కూడా ఢిల్లీ వాయు ప్ర‌దేశంలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Recommended Video

సిగ్గుపడాలి.. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారు..!
రాఫెల్ కొనుగోళ్ల‌లో ఆమెదే కీల‌క పాత్ర‌..! అందుకే మ‌రో ప‌ద‌వి ఇచ్చార‌ని కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు..!

రాఫెల్ కొనుగోళ్ల‌లో ఆమెదే కీల‌క పాత్ర‌..! అందుకే మ‌రో ప‌ద‌వి ఇచ్చార‌ని కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు..!

రాఫెల్ స్కామ్ మోడీ సర్కారును కుదిపేస్తున్న అంశం. బిజెపి పైకి గంభీరంగా కాంగ్రెస్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఈ అంశంతో మోడీ సర్కారు ప్రతిష్ట మాత్రం మసకబారిందనేది వాస్తవం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి తాజాగా ఓ కొత్త అంశంపై ఢిల్లీ అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగోతంది. ఈ స్కాంలో ఆమె ప్రభుత్వానికి సహకరించినందుకే అత్యంత కీలకమైన పదవి ఇచ్చారా?. పదవి విమరణకు ముందే ఆరేళ్ల పదవీ కాలం ఉండే పోస్టు ఇవ్వటం వెనక రాఫెల్ స్కామ్ లో ఆమె చేసిన సాయమే కారణమా? అన్న కోణాన్ని కూడా అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి. ఇంతకూ ఆమె ఎవరు? తెలుసుకుందాం..!

దేశ ర‌క్ష‌ణ విబాగాల కొనుగోళ్ల‌లో ఆమెదే హ‌వా..! అందుకే ఆమెకు కొత్త కొలువా..?

దేశ ర‌క్ష‌ణ విబాగాల కొనుగోళ్ల‌లో ఆమెదే హ‌వా..! అందుకే ఆమెకు కొత్త కొలువా..?

స్మితా నాగరాజ్. ఈమె సీనియర్ ఐఏఎస్ అధికారి. తమిళనాడుకు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోడీ ప్ర‌భుత్వం ఆమెను అత్యంత కీలకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమించింది. ఇది గత ఏడాదే జరిగంది. ఈ నియామకానికి ముందు ఆమె అత్యంత కీలకమైన రక్షణ శాఖలో డైరక్టర్ జనరల్ గా పనిచేశారు. అంటే దేశ రక్షణ విభాగానికి అవసరమైన కొనుగోళ్ల వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత కీలకమైందో అర్థం అవుతోంది.

జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటికి కాంగ్రెస్ డిమాండ్..! స‌సేమిరా అంటున్న బీజేపి..!!

జాయింట్ పార్ల‌మెంట్ క‌మిటికి కాంగ్రెస్ డిమాండ్..! స‌సేమిరా అంటున్న బీజేపి..!!

రాఫెల్ డీల్ విషయంలో ఆమె సహకరించినందునే, ఐఏఎస్ గా పదవి విరమణ చేయటానికి ఏడాదికి పైగా సమయం ఉన్న తరుణంలో ఆమెను ఆరేళ్ల పాటు ఉండే యూపీఎస్ సీ సభ్యురాలి పదవి కట్టబెట్టారని ఢిల్లీ అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆమె యూపీఎస్ సి సభ్యురాలిగా 2023 సెప్టెంబర్ 21 వరకూ కొనసాగనున్నారు. రాఫెల్ స్కామ్ విషయంలో ఆమె ప్రభుత్వానికి తన వంతుగా సహకరించినందునే మోడీ ప్రభుత్వం ఆమెకు ఈ కీలక పోస్టును కట్టబెట్టారని చెబుతున్నారు. రాఫెల్ స్కామ్ గుట్టురట్టు కావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపీసీ) వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది.

ఫైళ్లును బ‌య‌ట పెట్టాలంటున్న కాంగ్రెస్..! క‌ష్టం అంటున్న క‌మ‌ల‌ పార్టీ..

ఫైళ్లును బ‌య‌ట పెట్టాలంటున్న కాంగ్రెస్..! క‌ష్టం అంటున్న క‌మ‌ల‌ పార్టీ..

అయితే దీనికి బిజెపి సర్కారు ససేమిరా అంటోంది. జెపీసీ అంటూ వేస్తే ఈ ఫైళ్లకు సంబంధించిన అంశాలు సభ్యుల చేతికి వస్తాయి. దీంతో సర్కారు ఇరకాటంలో పడటం ఖాయం. అందుకే మోడీ ప్రభుత్వం జెపీసీకి అంగీకరించటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాఫెల్ డీల్ వెనక స్మితా నాగరాజ్ పాత్ర ఏదైనా ఉందా? లేదా అన్నది ఫైళ్ళను పరిశీలిస్తే తప్ప తేలదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆమె చేసిన చివరి పోస్టు, జరిగిన నియామకం చూస్తే మొత్తానికి ఏదో మ‌త‌ల‌బు ఉన్నట్లే కన్పిస్తోందని టెన్ జ‌న్ ప‌థ్ వ‌ర్గాలు అనుమానిస్తున్నారు.

English summary
The BJP government is facing serious charges of acquisition of 'Rafael' aircraft related to national security. There are allegations that the Prime Minister of India, Modi, is corrupt. Rahul Gandhi said that the chauwkidar with the latest developments became 'Chor'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X