హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవెగౌడకు మోడీ శుభాకాంక్షలు: రాహుల్ క్షమాపణలు, ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా దేవెగౌడకు క్షమాపణలు కూడా చెప్పారు రాహుల్.

Recommended Video

కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

బీజేపీ ప్రలోభాలు: మొబైల్ యాప్‌తో చెక్ పెడుతోన్న కాంగ్రెస్ బీజేపీ ప్రలోభాలు: మొబైల్ యాప్‌తో చెక్ పెడుతోన్న కాంగ్రెస్

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడిన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ మద్దతు కోసం ఆరాటపడ్డాయి. చివరకు జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేయడమే ఇందుకు కారణం.

Modi, Rahul wish Deve Gowda on his birthday, Rahul also apologises

ఇది ఇలావుంటే, దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా.. 'మన మాజీ ప్రధాని దేవెగౌడతో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ' అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేవెగౌడకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..' ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. అయితే జేడీఎస్‌తో సంబంధాలు బలోపేతం చేసే ఉద్దేశంతో గురువారం రాహుల్‌.. దేవెగౌడతో కొద్దిసేపు మాట్లాడారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. జేడీఎస్ మీద విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. బీజేపీకి జేడీఎస్‌ టీమ్ బి పార్టీ లాంటిదని ఎద్దేవా చేశారు రాహుల్. అంతేగాక, జనతాదళ్(సెక్యులర్‌)ను కాస్తా జనతాదళ్(సంఘ్‌ పరివార్‌) అని తీవ్రంగా విమర్శించారు.

గోడ దూకెయ్, బయటే కారుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ ఫోన్, అందుకే హైదరాబాద్‌కు మకాం గోడ దూకెయ్, బయటే కారుంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ ఫోన్, అందుకే హైదరాబాద్‌కు మకాం

ఈ నేపథ్యంలో నాటి వ్యాఖ్యలపై దేవెగౌడకు రాహుల్‌ గాంధీ సారీ చెప్పినట్లు పార్టీ వర్గాల తెలిసింది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సందిగ్ధతపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎదురవుతున్న పరిణామాలపై కలిసికట్టుగా పోరాడాలని ఇద్దరు నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు అండగా ఉండాలని ఈ సందర్భంగా దేవెగౌడను రాహుల్ కోరినట్లు తెలిసింది.

English summary
With the JD(S) possibly holding the cards as dramatic developments unfolded in Karnataka, both Prime Minister Narendra Modi and Congress president Rahul Gandhi wished the party's supremo HD Deve Gowda on his birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X