వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

150వ జయంతి రూ.150 స్మారక నాణెం.. జాతిపిత స్మృతిగా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

జాతిపిత, మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.150 స్మారక చిహ్నాన్ని విడుదల చేశారు. గాంధీ జీ స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నాణెన్ని ఆవిష్కరించారు. స్వచ్చ భారత్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ జీ కలలు స్వచ్చ భారత్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంప్ విడుదల చేసిందని ప్రధాని మోడీ తెలిపారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్ :18వ సంవత్సరంలోనే ఇళ్లు విడిచి హిమాలయాలకు వెళ్లిన నరేంద్రమోడీ...! మ్యాన్ వర్సెస్ వైల్డ్ :18వ సంవత్సరంలోనే ఇళ్లు విడిచి హిమాలయాలకు వెళ్లిన నరేంద్రమోడీ...!

కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు గుజరాత్ సీఎం విజయ్ రుపానీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సబర్మతి ఆశ్రమం సందర్శకులు పుస్తకంలో మోడీ తన సందేశాన్ని కూడా రాశారు. 'గాంధీ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలతో సంతృప్తి చెందానని మోడీ పేర్కొన్నారు. గాంధీ జీ కలలు కన్న స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. దేశమంతా స్వచ్చంగా, పరిశుభ్రంగా మారబోతుందని తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రత పేరుతో దేశం హరితవనంగా రూపుదిద్దుకోబడుతుందని తెలిపారు.

Modi release commemorative Rs 150 coin on Gandhi birth anniversary

దేశంలో ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండటం మంచి పరిణామన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం చాలా తక్కువని చెప్పారు. ఇదిలా ఉంటే గత నెలలో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా రూ.350 స్మారక నాణెన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్ పేయి స్మారకార్థం రూ.100 నాణెన్ని కూడా ప్రధాని మోడీ విడుదల చేశారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా రూ.150 స్మారక నాణెన్ని ఆవిష్కరించారు.

English summary
prime Minister Narendra Modi released a commemorative Rs 150 coins on the occasion of Mahatma Gandhi's 150th birth anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X