వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సౌదీ పర్యటనకు క్యార్ తుఫాను ముప్పు... విమానం ఆ రూట్లో వెళ్లగలదా..?

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ తన బుద్ధిని ఇసుమంతైనా మార్చుకోలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం పాకిస్తాన్ గగనతలం మీదుగా విమానం ప్రయాణిస్తే తక్కువ సమయంలో సౌదీకి చేరుకుంటారు. కానీ మోడీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది పాకిస్తాన్. దీంతో మోడీ బోయింగ్ విమానం 747 ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానం ఇంధనం, సమయం కూడా వృథా కానుంది.

మోడీ విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వని పాక్

మోడీ విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వని పాక్

ప్రధాని నరేంద్రమోడీ విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కొత్త రూట్లో ప్రయాణించనుంది. ఢిల్లీ నుంచి ముంబైకి దగ్గరగా వెళ్లి ఆ పై అరేబియా సముద్రం మీదుగా టర్న్ తీసుకుని రియాద్ వైపు వెళ్ళనుంది. అయితే అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాన్ ప్రభావం ఉన్నందున ఫ్లైట్ ప్లాన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

విమానంకు క్యార్ తుఫాను ముప్పు

విమానంకు క్యార్ తుఫాను ముప్పు


ఒకవేళ పాకిస్తాన్ గగనతలం మీదుగా విమానం ఎగిరి ఉంటే క్యార్ తుఫాను ముప్పు ఉండేది కాదు. ముంబై మీదుగా అయితే క్యార్ తుఫాను ముప్పు ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ముంబైలోని అరేబియా సముద్రం మీదుగా వెళుతుందంటే సౌదీకి చేరుకునేందుకు 45 నిమిషాలు అదనంగా సమయం తీసుకుంటుందని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ ఆదివారం వెల్లడించింది.

ఫ్లయిట్ ప్లాన్ మారే అవకాశం..?

ఫ్లయిట్ ప్లాన్ మారే అవకాశం..?

భారత వాతావరణశాఖ నివేదిక ఇచ్చిన ప్రకారం క్యార్ తుఫాను క్రమంగా ఒమన్ తీరంవైపు కదులుతోంది. ముంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు మహారాష్ట్ర, కర్నాటక, గోవాల్లో కురుస్తాయని పేర్కొంది. ముంబై నైరుతీ తీరానికి 580 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణించే ఫ్లయిట్ ప్లాన్‌ ఉంటుంది. ఇక సోమవారం రియాద్‌లో ప్రధాని మోడీ ల్యాండ్ అవుతారు. పర్యటనలో సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అవుతారు. ఆ తర్వాత మంగళవారం జరిగే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ ఫోరంలో పాల్గొంటారు.

 రాష్ట్రపతి విమానంను కూడా అడ్డుకున్న పాక్

రాష్ట్రపతి విమానంను కూడా అడ్డుకున్న పాక్


ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటన సందర్భంలో కూడా ఆయన ప్రయాణించాల్సిన విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా కూడా తమ గగనతలంలో విమానం ఎగిరేందుకు పాక్ నిరాకరించింది.

English summary
Prime Minister Narendra Modi’s Air India One will take the alternative route to Saudi Arabia as Pakistan has denied permission to the Indian PM's flight to fly in its airspace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X