వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా.. మోడీ ప్రమాణ స్వీకారం చూస్తూ అమ్మ మురిసింది

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ : తన కొడుకు దేశానికి రెండో సారి ప్రధాని కావడం చూసి ఎంతో ఆనందించింది ఆ తల్లి. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా వీక్షించలేకపోయిన తల్లి హీరాబెన్ టీవీలో మోడీ ప్రమాణ స్వీకారం చూసి ఆనందానికి గురైంది. దేశ ప్రజల మనసులను తన కొడుకు గెలుచుకున్నందుకు ఎంతో గర్వపడింది హీరాబెన్. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

Modis mother Heeraben wathces him taking oath on TV,gets emotional

గాంధీనగర్‌లోని తన ఇంట్లో మోడీ తల్లి హీరాబెన్ టీవీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించగానే ఇంట్లో టీవీ ముందు కూర్చుని చపట్లు కొట్టారు హీరాబెన్. తన కొడుకు మరోసారి హీరో అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీ సాధించడంలో మోడీ కృషి ఎంతగానో ఉంది. ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా తల్లిని కలవలేకపోయిన మోడీ... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

Modis mother Heeraben wathces him taking oath on TV,gets emotional

హీరాబెన్ గాంధీనగర్‌లో మోడీ తమ్ముడు పంకజ్‌తో పాటు ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తల్లిని చూసి ఆమెతో 20 నిమిషాలు గడిపారు మోడీ. ఆ తర్వాత ఆమెకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోడీ వెళ్లారు. ఇక గురువారం రోజున రెండో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. అంతేకాదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలు కూడా హాజరయ్యారు.

English summary
Prime Minister Narendra Modi's mother Heeraben was visibly overwhelmed with emotion as she watched on TV the swearing-in ceremony at Rashtrapati Bhavan on Thursday.Watching the live telecast on television at her house in Gandhinagar, Heeraben Modi clapped as President Ram Nath Kovind administered the oath of office to Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X