వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ బుల్లెట్ రైళ్లలా: మోడీపై షింజో అబే ప్రశంసలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే శనివారం ప్రధాని మోడీతో కలిసి ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై షింజో అబే ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రధాని మోడీ ఆర్ధిక విధానాలు జపాన్ బుల్లెట్ రైళ్లులా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఒప్పందాలు చేసుకున్నారు.

Modi’s policies just like bullet trains fast, safe and reliable: Abe

ఈ ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కొత్త అధ్యయాన్ని సృష్టించాయి. అంతక ముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్‌కు కావాల్సింది కేవలం జపాన్ బుల్లెట్ రైళ్ల ఒప్పందమే కాదని, అభివృద్ధిని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌కు జపాన్ చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మేకిన్ ఇండియా కార్యక్రమం కోసం జపాన్ బిలియన్ డాలర్ల నిధులను కేటాయించిందని ఆయన తెలిపారు. తొలిసారిగా భారత కార్ల కంపెనీ మారుతి సుజుకీ చేసిన కార్లను జపాన్ ఎగుమతి చేసుకుంటుందని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలుకు జపాన్ సుమారు 12 బిలియన్ డాలర్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.

భారత్‌‌లో పెట్టుబడులు పెట్టేందుకు అపరిమితమైన అవకాశాలున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఎలాంటి సమస్యలు, విబేధాలున్నా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జపాన్ సహకారంతో ముంబై-అహ్మాదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు‌ మార్గానికి అంగీకారం కుదిరిందన్నారు.

English summary
“Today, there is a ‘Make In India’ movement in Japan. I have been told that $11-12 billion fund has been earmarked for it. This clearly indicates how both the countries can move forward,” he said while addressing the India-Japan Business Leaders Forum in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X