వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా చిన్నారి.. మరో నిర్భయ?: ఆత్మరక్షణలో బీజేపీ!, స్మృతీ నోరు విప్పరా..

|
Google Oneindia TeluguNews

Recommended Video

8 ఏళ్ల చిన్నారిపై హిందూ దేవాలయంలో గ్యాంగ్ రేప్...!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే గ్యాంగ్ రేప్.. కశ్మీర్ లోని ఓ హిందూ దేవాలయంలో 8మంది ప్రభుత్వ అధికారులు 8ఏళ్ల చిన్నారిపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్.. ఇటీవలి కాలంలో దేశాన్ని అత్యంతగా కుదిపేసిన సంఘటనలు ఈ రెండు. రెండు కేసుల్లోనూ పోలీసుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపించిందన్న ఆరోపణలున్నాయి. బాధితుల తరుపున కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

కథువా రేప్: ప్రధాని నిందితుడితోపాటు 8మందిపై ఛార్జీషీటు, అత్యంత పాశవికం <br>కథువా రేప్: ప్రధాని నిందితుడితోపాటు 8మందిపై ఛార్జీషీటు, అత్యంత పాశవికం

Modis women ministers mum on Kathua, Unnao rapes

ఈ రెండు ఘటనలపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా కశ్మీర్ బాలిక పట్ల పాశవికంగా వ్యవహరించిన తీరు మరో 'నిర్భయ' ఘటనను తలపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నిర్భయను రేప్ చేసినవారిలో అంతగా చదువుకోనివారే ఎక్కువ కాగా.. తాజా ఘటనలో అందరూ ప్రభుత్వ అధికారులు, పెద్దవారే ఉండటం గమనార్హం. గుర్రాలను మేపుతున్న సందర్భంలో బాలికను కిడ్నాప్ చేసి.. ఓ గుడిలో ఆమెను బంధించి.. డ్రగ్స్ ఇచ్చి.. ఎనిమిది మంది ఆమెపై రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెపై అత్యాచారం చేసినన్ని రోజులు ఆమెకు తిండి కూడా పెట్టలేదు. ఆఖరికి ఆమె కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ.. మరోసారి రేప్ చేసి మరీ బండరాయితో మోది ఆమెను హత్య చేశారు. ఆ చిన్నారిది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బాలిక కావడంతో.. మత విద్వేషం కోణంలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

స్మృతీ నోరు విప్పరా..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న నిర్భయ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై మహిళా భద్రత గురించి హామి ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.

బీజేపీ ఎమ్మెల్యే గ్యాంగ్ రేప్, కశ్మీర్ కథువా బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలపై కేంద్రంలోని మహిళా మంత్రులు నోరు విప్పకపోవడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీనిపై స్పందించాల్సిందిగా జాతీయ మీడియా కేంద్రం మంత్రి స్మృతి ఇరానీని కోరినప్పటికీ ఆమె మాత్రం పెదవి విప్పలేదు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో.. ప్రతిపక్షం తీరుకు నిరసనగా బీజేపీ నిర్వహించిన ఒక్కరోజు దీక్షలో పాల్గొన్న సందర్భంలో మీడియాను ఆమెను ప్రశ్నించింది. కానీ స్మృతి మాత్రం మీడియాను తప్పించుకుని వెళ్లిపోయింది.

ఇక మరో ఫైర్ బ్రాండ్, కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించినప్పటికీ.. కథువా రేప్‌ను కుల, మతాల కోణంలో చూడరాదని మాత్రమే ఆమె ప్రజలకు అప్పీల్ చేశారు. చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు.

మరో మంత్రి మేనక గాంధీని మీడియా సంప్రదించగా..'ఈ ఘటన నన్ను చాలా లోతుగా కలచివేసింది' అని చెప్పారు. 12సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై అత్యాచారం చేస్తే.. పోస్కో చట్టం పెట్టడంతో పాటు దానికి ఉరిశిక్షను కూడా జతచేయాలని తాము కోరుతున్నట్టు తెలిపారు.

English summary
olitics has taken centre stage in the horrific rapes in Kathua (J-K) and Unnao (UP) with Prime Minister Narendra Modis women ministers going on the defensive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X